News March 9, 2025
గొల్లప్రోలు: ఆ వ్యక్తి ఎవరు?

గొల్లప్రోలు మండలం చేబ్రోలు బైపాస్ రోడ్డులో పోలవరం కాలువ చెంతన గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురైన ఘటనపై దర్యాప్తు కోసం 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. బైపాస్ రోడ్డులో వ్యక్తి మరణించి ఉండగా పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. పోలీసులకు ఆరు రోజులైనా ఎలాంచి క్లూ లభించలేదు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఏ ఊరు వేరే ప్రాంతంలో హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి వదిలివేశారా అనే విషయాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 7, 2026
కడప: ‘10th పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి’

కడప జిల్లాలో 10th పరీక్షలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జేసీ నిధిమీనా పరీక్షల నిర్వాహక అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సభా భవన్‌లో పది పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 169 సెంటర్లలో 28,158 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్జేడీ శామ్యూల్, ఏసీ , డీఈఓ శంషుద్దీన్ హాజరయ్యారు.
News March 7, 2026
మహబూబాబాద్: ప్రతి మనిషి అభివృద్ధిలో మహిళల పాత్రే కీలకం: జిల్లా జడ్జి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కోర్టు సముదాయంలో శనివారం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి వ్యక్తి ఎదుగుదలలో, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. గృహ హింస, వరకట్న వేధింపులకు గురవుతున్న బాధితులకు అండగా నిలుస్తున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానెల్ న్యాయవాదులను అభినందించారు.
News March 7, 2026
మహిళా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 8న జిల్లావ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శనివారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. భీమవరంలోని విష్ణు కళాశాలలో జిల్లా స్థాయి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలన్నారు.


