News February 7, 2025

గొల్లప్రోలు: పవన్ చొరవ.. ఆ గ్రామస్థుల కల నెరవేరింది

image

గొల్లప్రోలు మండలం చిన్న జగ్గంపేట గ్రామస్థుల కల నెరవేరింది. గొల్లప్రోలు, తాటిపర్తి గ్రామాల నుంచి చిన్న జగ్గంపేట గ్రామానికి వెళ్లే రోడ్డు గోతులమయంగా మారడంతో రాత్రి సమయంలో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలు గురయ్యేవారు. ఆ గ్రామస్థులు అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం లేదు. దీంతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లగా రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీంతో ఆ గ్రామస్థుల ఇబ్బందులు తొలిగాయి.

Similar News

News March 24, 2025

నల్గొండ: లాడ్జిలో వ్యక్తి మృతదేహం లభ్యం

image

నల్గొండ పట్టణంలోని రూపా లాడ్జిలో గుర్తుతెలియని వ్యక్తి(35) డెడ్ బాడీని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇతడు విజయవాడ ఫైర్ వర్క్స్‌లో పనిచేస్తున్నట్లు లాడ్జి రికార్డ్స్‌లో ఉందని నల్గొండ టూ టౌన్ పీఎస్ SI సైదులు తెలిపారు. మృతుడిని నవీన్‌గా గుర్తించామన్నారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే 87126 70176 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

News March 24, 2025

సిలిండర్ పూర్తిగా ఆఫ్ చేయకపోవడంతోనే పేలుడు..

image

కర్నూలు జిల్లా ఆలూరు మం. కురవల్లి గ్రామంలో వంట గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన నిన్న జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు అయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. సిలిండర్ పూర్తిగా ఆఫ్ చేయకపోవడంతో గ్యాస్ లీకైంది. ఉదయం లైటు స్విచ్ వేయగానే ఒక్కసారిగా సిలిండర్ పేలిందని ఎస్సై మహబూబ్ బాషా తెలిపారు. ప్రమాదంలో దంపతులు గురుస్వామి, గాయత్రి, వారి కుమారుడు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.

News March 24, 2025

నాగారం: ఆరు కాళ్లతో గొర్రె పిల్ల జననం

image

సూర్యాపేట జిల్లా నాగారం మండలం పసునూరు గ్రామంలో గొర్రె ఆరు కాళ్లతో ఉన్న గొర్రె పిల్లకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పసునూరు గ్రామానికి చెందిన ఉప్పుల లింగమల్లు గొర్ల కాపరి ఆదివారం ఉదయం తాను పెంచుకుంటున్న గొర్రెకి ఆరు కాళ్లతో ఉన్న గొర్రె పిల్లకి జన్మించిందని తెలిపారు. కాగా గొర్రె పిల్ల ఆరోగ్యంగా ఉందని పశు వైద్యుడు పేర్కొన్నారు.

error: Content is protected !!