News February 2, 2025
గొల్లప్రోలు: మద్యం తాగొద్దన్న భార్య.. భర్త ఆత్మహత్యాయత్నం

గొల్లప్రోలు చెందిన బర్రె శ్రీను కూలీ పని డబ్బులతో మద్యం తాగేందుకు వెళుతుండగా భార్య అడ్డుకొని జేబులో డబ్బులు తీసుకుంది. ఎన్నిసార్లు అడిగినా భార్య డబ్బులు ఇవ్వకపోవడంతో వీరిద్దరి మధ్య కొంతసేపు గొడవ కూడా జరిగింది. భార్య మంచి నీళ్ల కోసం వెళ్లింది. శ్రీను మనస్తాపానికి గురై ఇంటిలోకి వెళ్లి తాడుతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. కిందకి దీంచి ఆసుపత్రికి తరలించారు. భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News February 13, 2025
ఉత్తరాంధ్ర టీచర్ MLC బరిలో 10 మంది

ఉత్తరాంధ్ర టీచర్ MLC స్థానానికి 10మంది పోటీలో ఉన్నట్లు ఎన్నికల అధికారి హరేంధిర ప్రసాద్ తెలిపారు. 10మంది నామినేషన్ వెయ్యగా.. ఏ ఒక్కరూ ఉపసంహరించుకోలేదన్నారు. ఈనెల 27న పోలింగ్ జరగనుండగా.. మార్చి 3న కౌంటింగ్ ఉండనుంది. 12 ఎంసీసీ బృందాలు, 11 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థులతో గురువారం ఆయన సమావేశమయ్యారు. నేర చరిత్ర లేనివారిని ఏజెంట్లుగా నియమించుకోవాలని సూచించారు.
News February 13, 2025
జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు సిద్దిపేట ‘రాణి’

జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలకు సిద్దిపేట జిల్లాకు చెందిన క్రీడాకారిణి రాణి ఎంపికైనట్లు సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శివకుమార్ తెలిపారు. ఇటీవల జరిగిన సెలక్షన్స్‌లో రాష్ట్ర కబడ్డీ జట్టులో రాణి చోటు దక్కించుకుందని చెప్పారు. ఈ సందర్భంగా ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకు హరియాణాలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో రాణి పాల్గొంటుందని పేర్కొన్నారు.
News February 13, 2025
NRPT: ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్

భేటీ బచావో భేటీ పఢావో కార్యక్రమానికి సంబంధించిన ప్రచార రథాన్ని గురువారం నారాయణపేట కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిర్మూలన, లింగ సమానత్వం, బాలిక విద్యపై జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. బాలికల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.