News January 26, 2025

గొల్లప్రోలు: మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

image

గొల్లప్రోలు పట్టణ పరిధి కొత్తపేటకు చెందిన రాజనాల వెంకన్న మద్యానికి బానిసై కొంతకాలంగా పనికి వెళ్లకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. అతని భార్య రాజ్యలక్ష్మి పనికి వెళ్లమని వెంకన్నను నిలదీయగా దీంతో మనస్తాపానికి గురైన వెంకన్న ఇంటి వద్ద ఉన్న చెద పురుగులకు కొట్టే మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.

Similar News

News December 9, 2025

విశాఖలో కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న CM

image

CM చంద్రబాబు ఈనెల 12న‌ విశాఖలో ప‌ర్య‌టించ‌నున్నారు. ముందుగా మధురవాడ ఐటీ సెజ్ హిల్-2లో ప్రముఖ IT కంపెనీ కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అదేవిధంగా కాపులుప్పాడలో ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం వీఈఆర్ సమావేశానికి హాజరై, వివిధ అభివృద్ధి అంశాలపై సమీక్ష చేస్తారు. పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

News December 9, 2025

13న నరసాపురంలో జాతీయలోక్ అదాలత్: జడ్జి

image

ఈ నెల 13న నర్సాపురంలోని అన్ని కోర్టు సముదాయాలలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని నర్సాపురం పదో అదనపు జిల్లా న్యాయమూర్తి వాసంతి తెలిపారు. న్యాయవాదులు, పోలీసు అధికారులు సహకరించాలని న్యాయమూర్తి సూచించారు. రాజీపడదగిన అన్ని క్రిమినల్, ఎక్సైజ్, మోటార్ వాహన ప్రమాద భీమాకు సంబంధించిన కేసులు, సివిల్ తగాదాలు, కుటుంబ తగాదాలు రాజీ చేసుకోవచ్చని చెప్పారు.

News December 9, 2025

KMR: తొలి దశ పోలింగ్‌కు రంగం సిద్ధం: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా, మొదటి దశలో ఎన్నికలు జరిగే మండలాలకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది తుది ర్యాండమైజేషన్ ప్రక్రియ మంగళవారం పూర్తయింది. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమక్షంలో ఈ ర్యాండమైజేషన్ జరిగింది. మొదటి దశలో జీపీలు 157, 1444 వార్డులకు ఎన్నికలు నిర్వహించడానికి 1457 టీములకు సంబంధించిన మండలాల వారీగా ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు.