News January 26, 2025
గొల్లప్రోలు: మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

గొల్లప్రోలు పట్టణ పరిధి కొత్తపేటకు చెందిన రాజనాల వెంకన్న మద్యానికి బానిసై కొంతకాలంగా పనికి వెళ్లకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. అతని భార్య రాజ్యలక్ష్మి పనికి వెళ్లమని వెంకన్నను నిలదీయగా దీంతో మనస్తాపానికి గురైన వెంకన్న ఇంటి వద్ద ఉన్న చెద పురుగులకు కొట్టే మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.
Similar News
News February 14, 2025
బాసర అమ్మవారి ఆలయం ఆదాయం రూ.1,08,25,110

బాసర సరస్వతి అమ్మవారి హుండీకానుకలను ఆలయ అధికారులు గురువారం లెక్కింపు చేపట్టారు. రూ.1,08,25,110 నగదు, మిశ్రమ బంగారం 78 గ్రాములు, మిశ్రమ వెండి 4.800 కిలోలతో వివిధ దేశాలకు చెందిన కరెన్సీలు 36 నోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఆదాయం మొత్తం దేవస్థానానికి 79 రోజుల్లో సమకూరినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
News February 14, 2025
వంశీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

AP: వల్లభనేని <<15453734>>వంశీకి<<>> నేర చరిత్ర ఉందని, అతనిపై ఇప్పటివరకు 16 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసును విత్ డ్రా చేసుకోవాలని వంశీ, అతని అనుచరులు సత్యవర్ధన్‌ను బెదిరించారని తెలిపారు. సత్యవర్ధన్ సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. వంశీకి బెయిల్ ఇవ్వొద్దని, రిమాండ్ విధించాలని కోరారు. ఈ కేసులో మరికొంత మంది నిందితులు దొరకాల్సి ఉందన్నారు.
News February 14, 2025
రిటర్నింగ్ అధికారుల విధులు చాలా కీలకం: డీపీవో

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఆర్వో, సహాయ రిటర్నింగ్ అధికారుల విధులు చాలా కీలకమని జిల్లా పంచాయతి అధికారి నారాయణ రావు తెలిపారు. గురువారం భూపాలపల్లి, కాటారం డివిజన్లకు సంబంధించిన రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం నియమ, నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.