News March 31, 2025
గొల్లప్రోలు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

గొల్లప్రోలు రైల్వే స్టేషన్ వద్ద రైలు నుంచి జారిపడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. వీక్లి స్పెషల్ రైలు నుంచి విశాఖ జిల్లా మర్రిపాలెంకి చెందిన అనిల్ కుమార్గా పోలీసులు గుర్తించారు. అతడు రైలులోని వాష్ బేసిన్ దగ్గరికి రావడంతో ఒక్కసారిగా ట్రైన్ నుంచి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వివరించారు. సంఘటన ప్రాంతానికి తుని రైల్వే పోలీసులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
Similar News
News January 4, 2026
టుడే టాప్ స్టోరీస్

* TG: నీటి వాటాలపై కేసీఆర్ సంతకం తెలంగాణకు మరణశాసనం: CM రేవంత్
* TG: తోలు తీస్తా అన్నవాళ్ల నాలుక కోస్తా: CM రేవంత్
* TG: కొండగట్టుకు పవన్.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన
* AP: రేపు భోగాపురం ఎయిర్పోర్టులో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్
* గంజాయి తీసుకుంటూ దొరికిన AP BJP MLA ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్
* వెనిజులాపై US దాడి.. అదుపులోకి అధ్యక్షుడు మదురో
* న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు భారత జట్టు ఎంపిక
News January 4, 2026
2 గంటలు అనర్గళంగా రేవంత్ ప్రసంగం

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో 2 గంటలు ఏకధాటిగా మాట్లాడారు. రాత్రి 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు అనర్గళంగా ప్రసంగించారు. కృష్ణా జలాల కేటాయింపు, పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుల విషయంలో BRS అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. నాటి CM KCR, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావే అంతా చేశారని ధ్వజమెత్తారు. అయితే నీళ్ల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వమని స్పష్టం చేశారు.
News January 4, 2026
సంగారెడ్డి: పది నుంచి టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు పరీక్ష

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. హాల్ టికెట్లు www.bse.telangana.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. పరీక్షలు సెయింట్ ఆంతోని (శాంతినగర్), సెయింట్ ఆంథోని (విద్యానగర్), సెయింట్ ఆర్నాల్డ్, కరుణ పాఠశాలలో పరీక్ష జరుగుతాయని పేర్కొన్నారు.


