News February 26, 2026

గొల్లల మామిడాడలో దర్శకుడు శేఖర్ కమ్ముల సందడి

image

ప్రముఖ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల బుధవారం పెదపూడి మండలం గొల్లల మామిడాడ సూర్య దేవాలయాన్ని సందర్శించారు. ఒక వివాహ వేడుక కోసం ఇక్కడికి వచ్చిన ఆయన.. సంపర, గండ్రేడు గ్రామాలను కూడా పరిశీలించారు. కొత్త సినిమా షూటింగ్ కోసం లోకేషన్లను వెతుకుతున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఈ పర్యటనలో ఆధ్యాత్మికవేత్త అద్దంకి సత్యనారాయణమూర్తి, స్థానికులు పాల్గొన్నారు.

Similar News

News April 14, 2026

చేపల కోసం ఈ పక్షి వేసే స్కెచ్ మామూలుగా లేదుగా!

image

కాకినాడ సమీపంలోని కోరింగ మడ అడవులలో నివసించే ‘లిటిల్ హెరాన్’ పక్షి తన అద్భుతమైన వేట నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇది చేపలను పట్టడానికి నీటి ఉపరితలంపై తన ఈకను ఎరగా వేసి నిశ్శబ్దంగా వేచి చూస్తుంది. ఆ ఈకను ఆహారంగా భావించి దగ్గరకు వచ్చే చేపలను ఇది మెరుపు వేగంతో వేటాడుతుంది. దీని వినూత్నమైన వేట పద్ధతి ప్రకృతిలోని అద్భుతాలకు నిదర్శనం. ఇది అత్యంత తెలివైన పక్షులలో ఒకటిగా గుర్తింపు పొందింది.

News April 14, 2026

బాలికపై అత్యాచారం.. నిందితుడికి జైలుశిక్ష: ప్రకాశం ఎస్పీ

image

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధిస్తూ ఒంగోలు POCSO కోర్టు తీర్పు వెలువరించింది. దొనకొండ మండలానికి చెందిన వ్యక్తి 14 ఏళ్ల బాలికను మాయమాటలతో హైదరాబాద్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. పోలీసుల దర్యాప్తుతో నేరం రుజువై శిక్ష విధించగా.. సంబంధిత అధికారులను ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీసులను అభినందించారు.

News April 14, 2026

TPT: 2000కు పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

image

శ్రీకాళహస్తి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఏప్రిల్ 15వ తేదీన తన తండ్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా పోస్టర్లను ఆవిష్కరించారు. స్కిట్ కళాశాలలో ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. 30కి పైగా బహుళ కంపెనీలు పాల్గొంటున్నాయని, 2000కు పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. యువతీ, యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.