News February 7, 2025
గోకవరంలో కాకినాడ జిల్లా యువకుడి మృతి

తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో కొత్తపల్లి నుంచి కామరాజుపేటకు వెళ్లే జంక్షన్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. కాకినాడ జిల్లా బెండపూడికి చెందిన సతీష్ (18)గా పోలీసులు గుర్తించారు. సతీష్ అమ్మమ్మ ఊరైన కామరాజుపేటకి తన స్నేహితుడితో వచ్చాడని, అంతలోనే ప్రమాదం జరిగి చనిపోయాడని SI పవన్ కుమార్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News January 5, 2026
HYD: ఆధార్ సెంటర్ ఎక్కడో ఈజీగా తెలుసుకోండి

గ్రేటర్ పరిధి రామంతాపూర్లో ఆధార్ సెంటర్ వద్ద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాసిన కథనంపై ఆధార్ సర్వీస్ యంత్రాంగం స్పందించింది. ఆధార్ అప్డేట్ చేసుకునేవారు పెరగటంతో రద్దీ ఏర్పడుతున్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు. గ్రేటర్ HYD వ్యాప్తంగా ఆధార్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని, వాటి వివరాలు తెలుసుకోవడం కోసం bhuvan.nrsc.gov.in/aadhaar/ వెబ్సైట్ సందర్శించాలని సూచించారు.
News January 5, 2026
నందీశ్వరుడు శివుడి వైపే ఎందుకు చూస్తాడు?

శివాలయాల్లో నంది శివుడి వైపే చూస్తుంటాడు. ఇది ఏకాగ్రత, భక్తికి సంకేతం. ఆయన శివుడికి అత్యంత సన్నిహితుడైన ద్వారపాలకుడు. మనసులోని ఆలోచనలు అటు ఇటు తిరగకుండా ఎప్పుడూ దైవచింతనలోనే ఉండాలని నంది స్థితి మనకు బోధిస్తుంది. భక్తుల కోరికలను విన్నవిస్తూ, వారిని శివదర్శనానికి సిద్ధం చేసేందుకు ఆయన శివుడి వైపే చూస్తూ ఉంటారు. ఆయన చెవిలో కోరికలు చెబితే వాటిని ఆయన నేరుగా శివుడికి చేరవేస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
News January 5, 2026
పక్షుల విడిది.. కవ్వాల్ అడవి!

కవ్వాల్ అభయారణ్యం పక్షుల కిలకిలరావాలతో పులకిస్తోంది. జన్నారం, ఇందన్పల్లి పరిధిలోని బైసన్ కుంట, గనిశెట్టి కుంట విదేశీ, స్వదేశీ పక్షులకు ఆవాసంగా మారాయి. అడవి, నీటి లభ్యత ఉండటంతో పక్షులు ఎక్కువగా విహరిస్తున్నాయి. FDO రామ్మోహన్ మాట్లాడుతూ.. పక్షులను, వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అడవుల రక్షణతోనే పక్షి జాతుల మనుగడ సాధ్యమన్నారు.
#నేడు జాతీయ పక్షుల దినోత్సవం


