News December 28, 2024
గోకవరం: 144 సెక్షన్ అమలు.. ఇద్దరు అరెస్ట్

గోకవరం మండలం గుమ్మల దొడ్డి గ్రామంలో అలస్కాలో బాధితులు శనివారం తలపెట్టిన అఖిలపక్ష సమావేశాన్ని పోలీసులు భగ్నం చేశారు. గ్రామంలో 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా సమావేశాన్ని నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. తమ సమస్యలపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కోరుకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో గ్రామస్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 26, 2025
రాజమండ్రి రూరల్: దేశభక్తిని చాటిన విద్యార్థులు

రాజమండ్రి రూరల్ బొమ్మూరులోని కలెక్టరేట్‌లో బుధవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తిని, భారత స్వాతంత్ర్య పోరాట స్పూర్తిని ప్రతిబింబించేలా ఈ ప్రదర్శనలు సాగాయి. సంప్రదాయ భారతీయ కళ, సాహిత్య సోయగాలు ప్రతిఫలించిన ఈ కార్యక్రమాలు దేశభక్తి భావాలను మరింత బలోపేతం చేశాయి.
News November 26, 2025
రాజమండ్రి: మాక్ అసెంబ్లీ విజేతలకు కలెక్టర్ అభినందన

విద్యాశాఖ నిర్వహించిన మాక్ అసెంబ్లీ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బుధవారం కలెక్టర్ కీర్తి చేకూరి జ్ఞాపిక, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, వారు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి మాక్ అసెంబ్లీలో 8 మంది విద్యార్థులు, జిల్లా స్థాయిలో 13 మంది విద్యార్థులు పాల్గొన్నారని ఆమె తెలిపారు.
News November 26, 2025
రాజ్యాంగ స్ఫూర్తితో బాధ్యతలు నిర్వర్తించాలి: కలెక్టర్

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రాజమండ్రి కలెక్టరేట్‌లో కలెక్టర్ కీర్తి చేకూరి డా. బి.ఆర్. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగం ఇచ్చిన బాధ్యతలను ప్రతి ఒక్కరూ నిజాయితీ, కర్తవ్య నిబద్ధతతో నిర్వర్తించాలని కోరారు. ప్రతి ఒక్కరూ నీతి, నిజాయితీతో రాజ్యాంగ స్ఫూర్తితో మెలగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.


