News April 27, 2024

గోడం నగేష్‌ నామినేషన్‌పై గందరగోళం

image

BJP అభ్యర్థి గోడం నగేశ్ నామపత్రాల పరిశీలనలో గందరగోళం నెలకొంది. ఆయన తరఫున దాఖలైన అఫిడవిట్‌లో 3 చోట్ల ఖాళీలను పూరించకుండా వదిలేయటంపై BSP, కాంగ్రెస్‌, BRS అభ్యంతరం వ్యక్తం చేశాయి. వారి అభ్యంతరాలను పట్టించుకోకుండా నగేశ్ నామపత్రాన్ని ఆమోదించారు. దీంతో కాంగ్రెస్‌, BSP, BRS నేతలు కలెక్టరేట్‌లోనే నిరసనకు దిగారు. ఆర్‌వో పై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని కంది శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

Similar News

News December 16, 2025

ADB: మూడో దశ ఎన్నికలకు 938 మంది పోలీసులతో బందోబస్తు: ఎస్పీ

image

ఆదిలాబాద్‌ జిల్లాలో ఆరు మండలాలలో జరగనున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. 37 క్లస్టర్లు, 25 రూట్లలో, 151 గ్రామాల పరిధిలోని 204 పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 938 మంది పోలీసు సిబ్బందితో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.

News December 16, 2025

ADB: సోషల్‌ మీడియాపై నిఘా: ఎస్పీ

image

ఆదిలాబాద్‌ జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా వాట్సాప్‌, సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టేవారిపై పోలీసులు నిఘా ఉంచారని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. ప్రచారం ముగిసిన తర్వాత బయటి వ్యక్తులు గ్రామాల్లో ఉండరాదన్నారు. ఎలాంటి సమాచారం ఉన్నా డయల్‌ 100కు తెలియజేయాలని సూచించారు. గొడవలు, అల్లర్లకు పాల్పడకూడదని, ఎన్నికలు పూర్తయ్యాక విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు.

News December 16, 2025

ADB: ఇప్పటికి రూ.20 లక్షల విలువైన మద్యం స్వాధీనం: ఎస్పీ

image

ఎన్నికల నియమావళి ప్రారంభమైనప్పటి నుంచి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు రూ.20 లక్షల విలువైన 2,554 లీటర్ల మద్యం, 1.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇప్పటి వరకు 70 కేసుల్లో 200 మందికి పైగా కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నగదు, బహుమతులకు ప్రలోభపడకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.