News March 24, 2024
గోదారి జిల్లాల్లో 10 స్థానాల్లో జనసేన.. FINAL
రాష్ట్ర వ్యాప్తంగా జనసేన 21 చోట్ల పోటీ చేయనుండగా అందులో ఉభయ గోదావరి జిల్లాల నుంచి 10 అభ్యర్థులను ప్రకటిస్తూ ఫైనల్ లిస్ట్ విడుదల చేసింది. పి.గన్నవరం టికెట్ మొదట టీడీపీ అభ్యర్థికి కేటాయించినప్పటికీ చివరికి ఆ సీటు జనసేన ఖాతాలోకి వెళ్లింది. పోలవరం సీటు సైతం చివరివరకు సందిగ్ధత ఉండగా..చివరికి జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజుకు అవకాశం వచ్చింది. మొత్తంగా గోదారి జిల్లాలు జనసేనకు కీలకం కానుండగా ఓటరు ఎటువైపో..?
Similar News
News November 2, 2024
రూ.800 కోట్లతో రహదారులకు మరమ్మతులు: మంత్రి
రాష్ట్రంలో రూ.800 కోట్లతో రహదారులపై ఏర్పడిన గుంతలను మరమ్మతులు చేపట్టనున్నట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శనివారం యలమంచిలి మండలం దొడ్డిపట్ల వద్ద రూ.30 లక్షలతో పాలకొల్లు – దొడ్డిపట్ల రహదారి మరమ్మతు పనులను ఆయన ప్రారంభించారు. గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ సాధించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, ఆర్ & బీ డీఈ లు పాల్గొన్నారు.
News November 2, 2024
ప.గో.: గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు
గోదావరి పుష్కరాల నిర్వహణకు ముహూర్తం ఖరారయింది. ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కరాల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు మొదలు పెట్టింది. 2027 జులై 23 నుంచి ఆగస్టు 3 వరకు ఈ పుష్కరాలు జరగనున్నాయి. ఈసారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. దీంతో గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్ల నిధులతో ప్రతిపాదనలు అధికార యంత్రాంగం సిద్ధం చేసింది.
News November 2, 2024
ప.గో: బాలికపై అత్యాచారం
తిరుపతిలోని ఓ ప్రైవేటు లాడ్జిలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత బాలిక 9వ తరగతి చదువుతోంది. వెస్ట్ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన సతీష్(22) చెన్నైలోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. ఇతనికి అన్లైన్ ద్వారా ఓ బాలిక పరిచయమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో అతనిపై అలిపిరి పోలీసులు కేసు నమోదుచేసి రిమాండుకు తరలించారు.