News June 5, 2024

గోదారోళ్ల దెబ్బ.. ఇక జనసేనకు ‘గాజు గ్లాస్’..!

image

21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్నిచోట్లా గెలిచి TDP తర్వాత అత్యధిక MLAలతో అసెంబ్లీలో అడుగుపెట్టనుంది. ఈ ఎన్నికల్లో గెలిచిన స్థానాలతో జనసేనకు ఎన్నికల సంఘం గాజు గ్లాస్ ఖరారు చేయనుండటం వారికి మరో గుడ్ న్యూస్. 21 స్థానాల్లో మన ఉభయ గోదావరి నుంచే 11 ఉండటం గమనార్హం. అధికార వైసీపీ కేవలం 11 స్థానాల్లోనే గెలవగా.. జనసేన రెట్టింపు స్థానాల్లో విజయం సాధించింది. మన ఉభయ గోదారోళ్లు ఎక్కడా వైసీపీని ఆదరించలేదు.

Similar News

News December 19, 2025

రాజమండ్రికి చేరుకున్న మంత్రి నారా లోకేశ్

image

మంత్రి నారా లోకేశ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు భారీగా విమానాశ్రయానికి చేరుకున్నారు.

News December 19, 2025

రాజమండ్రి: 21న జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక

image

తూర్పుగోదావరి జిల్లా పురుషుల కబడ్డీ జట్టు ఎంపిక ఈనెల 21న నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి బురిడి త్రిమూర్తులు ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎస్.కే.వి.టి డిగ్రీ కళాశాల మైదానంలో ఈ ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లాలోని కబడ్డీ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు తప్పనిసరిగా 85 కేజీల లోపు బరువు ఉండాలని స్పష్టం చేశారు.

News December 19, 2025

RJY: మంత్రి నారా లోకేష్ షెడ్యూల్ ఇదే..!

image

నారా లోకేశ్ శుక్రవారం రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. ఉదయం 8:45కు విమానాశ్రయం చేరుకుని, తొలుత ఆర్ట్స్ కళాశాలలో నూతన భవనాలను ప్రారంభించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం నన్నయ వర్సిటీలో భవనాలను ప్రారంభిస్తారు. అనంతరం చెరుకూరి కళ్యాణ మండపంలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. మంత్రి పర్యటన నిమిత్తం అధికారులు, పార్టీ శ్రేణులు నగరంలో భారీ ఏర్పాట్లు చేశాయి.