News June 5, 2024

గోదారోళ్ల దెబ్బ.. ఇక జనసేనకు ‘గాజు గ్లాస్’..!

image

21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్నిచోట్లా గెలిచి TDP తర్వాత అత్యధిక MLAలతో అసెంబ్లీలో అడుగుపెట్టనుంది. ఈ ఎన్నికల్లో గెలిచిన స్థానాలతో జనసేనకు ఎన్నికల సంఘం గాజు గ్లాస్ ఖరారు చేయనుండటం వారికి మరో గుడ్ న్యూస్. 21 స్థానాల్లో మన ఉభయ గోదావరి నుంచే 11 ఉండటం గమనార్హం. అధికార వైసీపీ కేవలం 11 స్థానాల్లోనే గెలవగా.. జనసేన రెట్టింపు స్థానాల్లో విజయం సాధించింది. మన ఉభయ గోదారోళ్లు ఎక్కడా వైసీపీని ఆదరించలేదు.

Similar News

News July 5, 2025

పేరెంట్స్ డే నిర్వహణకు సమాయత్వం కావాలి: కలెక్టర్

image

జులై 10న ప్రభుత్వం నిర్వహించే పేరెంట్స్ డే నిర్వహణకు జిల్లా యంత్రాంగం సమాయత్వం కావాలని కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో మెగా పేరెంట్స్ డే, టీచర్స్ మీటింగ్, పి4 సర్వే, అన్నదాత సుఖీభవపై జిల్లా అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు అన్ని యాజమాన్యాల్లో ఉన్న స్కూళ్లలో పేరెంట్స్ డే నిర్వహిస్తామన్నారు. జేసీ కార్యచరణ ప్రణాళిక వివరించారు.

News July 5, 2025

కొవ్వూరు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

కొవ్వూరు రైల్వే స్టేషన్ శివారున గుర్తు తెలియని (35) ఏళ్ల వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని గుర్తించినట్లు రైల్వే ఎస్ఐ పి.అప్పారావు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం 10 గంటల మధ్య సమయంలో రైలు నుంచి జారిపడి మరణించి ఉండొచ్చని ఎస్ఐ తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని, వివరాల కోసం 9347237683 నంబర్‌ను సంప్రదించాల్సిందిగా కోరారు.

News July 5, 2025

ఇసుక అధిక లోడుతో వెళితే చర్యలు: కలెక్టర్ హెచ్చరిక

image

ఇసుక అధిక లోడు వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పి.ప్రశాంతి హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఇసుక ర్యాంప్‌ల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. తాళ్లపూడి, ప్రక్కిలంక, వేగేశ్వరపురం ర్యాంపు నుంచి అధిక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. నిబంధనలు పాటించని ఏజెన్సీలకు ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండానే రద్దు చేస్తామని హెచ్చరించారు. వాహనాల లోడింగ్, పడిన ఇసుక తొలగింపు బాధ్యత ఏజెన్సీలదే అన్నారు.