News March 20, 2024
గోదావరిఖనిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

కుటుంబ వివాదంతో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన GDKలో జరిగింది. వన్ టౌన్ SI రవీందర్ వివరాల ప్రకారం.. గాంధీనగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థి షెహజాద్.. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో ఉపవాస దీక్షలో ఉన్నాడు. అయితే యువకుడు ఆహారం తీసుకున్న విషయంలో కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి వివాదం జరిగింది. దీంతో మనస్తాపం చెందిన యువకుడు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Similar News
News December 16, 2025
కరీంనగర్: 454 మందికి రేపు అగ్ని పరీక్ష

కరీంనగర్ జిల్లాలో మూడో దఫా గ్రామపంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 108 గ్రామాలలో 454 మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానాలకు పోటీపడుతున్నారు. హుజూరాబాద్, ఇల్లందకుంట, జమ్మికుంట, సైదాపూర్, వీణవంక మండలాల్లోని 108 సర్పంచ్, 1034 వార్డులకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఐదు మండలాలలో 1,59,647 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
News December 16, 2025
KNR: మార్చిలోగా అమృత్-2 పనులు పూర్తి చేయాలి: సీడీఎంఏ

కరీంనగర్ జిల్లాలో అమృత్-2 పథకం కింద చేపట్టిన మంచినీటి సరఫరా పనులను మార్చిలోగా వేగవంతంగా పూర్తి చేయాలని సీడీఎంఏ శ్రీదేవి కమిషనర్లను ఆదేశించారు. పైప్‌లైన్, రిజర్వాయర్ల నిర్మాణాల పురోగతిపై ఆమె వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. పనులు ఆలస్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, వారానికి ఒకసారి పురోగతిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆమె స్పష్టం చేశారు.