News February 17, 2025
గోదావరిఖనిలో రక్తదాన శిబిరం

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని గోదావరిఖని మెడికల్ కళాశాలలో సోమవారం ప్రత్యేక రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ తెలిపారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలువాలని కోరుకంటి చందర్ కోరారు.
Similar News
News November 26, 2025
ట్యాంక్‌బండ్ వద్ద ఆందోళన.. ట్రాఫిక్ జామ్

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన GO 46ను రద్దు చేసి బీసీలకు 42% రిజర్వేషన్లతో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీసీ నాయకులు ట్యాంక్‌బండ్‌పై ఆందోళన చేపట్టారు. రిజర్వేషన్లలో భాగంగా కొన్ని మండలాల్లో బీసీలకు పంచాయతీలు రిజర్వ్ కాలేదన్నారు. రాస్తారోకో చేపట్టడంతో ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అక్కడి నుంచి తరలించారు.
News November 26, 2025
‘కమ్లా పసంద్’ ఓనర్ కోడలు ఆత్మహత్య

పాపులర్ పాన్ మసాలా కంపెనీ ‘కమ్లా పసంద్’ ఓనర్ కమల్ కిషోర్ కోడలు దీప్తి చౌరాసియా(40) ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీ వసంత్ విహార్‌లోని తన ఫ్లాట్‌లో ఆమె ఉరి వేసుకొని కనిపించారు. దీప్తి గదిలో పోలీసులు సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో భర్త హర్‌ప్రీత్ చౌరాసియా పేరును రాసినట్లు తెలుస్తోంది. 2010లో దీప్తి-హర్‌ప్రీత్ వివాహం చేసుకున్నారు. వారికి 14 ఏళ్ల కుమారుడు ఉన్నారు.
News November 26, 2025
BHPL: సర్పంచ్ పదవి కోసం మొదలైన సమావేశాలు

సర్పంచ్ పదవి కోసం రాజకీయ పార్టీల్లో దరఖాస్తుల కొలహాలం ప్రారంభమైంది. జయశంకర్ జిల్లాలోని 12 మండలాల్లో 248 గ్రామపంచాయతీలు ఉండగా మూడు విడతలుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వ రంగం సిద్ధం చేస్తుంది. మొదటి విడతలో నాలుగు మండలాలకు ఎన్నికలు జరగనుండగా.. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, ఇతర పార్టీల ఆశావాహులు దరఖాస్తులు చేసుకుంటున్నారు.


