News January 27, 2025
గోదావరిఖని: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

గోదావరిఖనిలో మేదర బస్తీకి చెందిన నందీశ్వర్ అనే ఇంటర్ విద్యార్థి రాత్రి తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నందీశ్వర్ ఎన్టీపీసీలోని ప్రైవేటు కళాశాలలలో ఇంటర్ చదువుతున్నాడు. ఘటనా స్థలానికి గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు చేరుకొని మృతదేహాన్ని ఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 13, 2025
జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన కలికిరి విద్యార్థిని

పలాస మండలంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఇటీవల జరిగాయి. ఈ పోటీల్లో కలికిరి పట్టణం ఇందిరమ్మ కాలనీలోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని ఈ. హాసిని వంద మీటర్ల పరుగు పందెంలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైంది. ఎంపికైన హాసినిని పాఠశాల HM రమేశ్, పీడీ రెడ్డి మోహన్, ఉపాధ్యాయులు అభినందించారు.
News November 13, 2025
12 నెలల వేతనాల చెల్లింపునకు నిధులు విడుదల

AP: రాష్ట్రంలోని ఇమామ్లు, మౌజన్ల వేతనాల చెల్లింపునకు ప్రభుత్వం రూ.90 కోట్లు విడుదల చేసింది. ఇమామ్లకు నెలకు రూ.10,000, మౌజన్కు నెలకు రూ.5వేల చొప్పున 2024 ఏప్రిల్-జూన్, 2025 జనవరి-సెప్టెంబర్ నెలలకు గౌరవ వేతనం చెల్లించనున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు మంత్రి ఫరూక్ కృతజ్ఞతలు తెలిపారు. మైనార్టీల సంక్షేమం, సాధికారతకు కట్టుబడి ఉందని తెలిపారు.
News November 13, 2025
16న పాడేరులో పర్యటించనున్న ఒడిశా సీఎం

ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ ఈనెల 16న పాడేరులో పర్యటించనున్నారు. పాడేరులో భగవాన్ బిర్సాముండా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారని జిల్లా అధికారులు తెలిపారు. ఈమేరకు ఎస్పీ అమిత్ బర్దార్ ఆదేశాలతో పాడేరు డీఎస్పీ షైక్ షహబాజ్ అహ్మద్ నేతృత్వంలో సీఐ డీ.దీనబంధు ఆధ్వర్యంలో ఎస్సై సురేశ్, ప్రత్యేక బృందాలతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.


