News March 27, 2025
గోదావరిఖని: చికిత్స పొందుతూ హోమియో వైద్యుని మృతి

గోదావరిఖనికి చెందిన ప్రముఖ హోమియో వైద్యుడు కె వెంకటేశ్వర్లు అనారోగ్యంతో మరణించారు. ఇటీవల HYDఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు కన్నుమూశారు. స్థానిక శారదానగర్ లోని ఆయన నివాసానికి మృతదేహాన్ని తీసుకువస్తున్నారు. రామగుండం లయన్స్ క్లబ్ లో గత కొన్నేళ్లుగా కీలకపాత్ర పోషిస్తున్న ఆయన మృతి పట్ల వైద్యులు, పలువురు సంతాపాన్ని ప్రకటించారు.
Similar News
News December 7, 2025
గోవాకు వెళ్తున్నారా? జాగ్రత్త

2023లో HYD యువతి (30) పెళ్లికి ముందు ప్రియుడితో కలిసి గోవాకు వెళ్లింది. అక్కడ బస ఏర్పాట్లు చేసిన యశ్వంత్ అనే వ్యక్తి తాజాగా తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రియుడితో గడిపిన వీడియోలను రికార్డు చేశానని, రూ.30 లక్షలు ఇవ్వకుంటే బయటపెడతానని బెదిరిస్తున్నాడని పేర్కొంది. తనకు వేరే వ్యక్తితో పెళ్లి అయిందని చెప్పినా వినట్లేదని వాపోయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News December 7, 2025
టెన్త్, ఇంటర్ అర్హతతో NGRIలో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (<
News December 7, 2025
మీ పిల్లలను ఇలా మోటివేట్ చేయండి

పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం తల్లిదండ్రుల ప్రధాన బాధ్యత. “నా వల్ల కాదు” అని చెప్పే అలవాటు ఉంటే సరైన ప్రోత్సాహంతో దాన్ని మార్చవచ్చు. ఫలితాలకంటే ప్రయత్నాన్ని ప్రశంసించాలి. “నీవు చేయగలవు”, “మళ్లీ ప్రయత్నించు” అని చెప్తే సానుకూల దృక్పథంతో ఆలోచిస్తారు. వారికి చిన్నచిన్న నిర్ణయాలు సొంతంగా తీసుకునే అవకాశం ఇవ్వాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల నమ్మకమే పిల్లల్లో ఆత్మవిశ్వాసానికి బలమైన పునాది అవుతుంది.


