News October 10, 2024

గోదావరిఖని టూ టౌన్ పరిధిలో యువకుడి హత్య

image

గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి యైటింక్లైన్ కాలనీ- హనుమాన్ నగర్‌లో వినయ్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. యువకుల మధ్య ఉన్న గొడవల నేపథ్యంలో పట్టపగలే కత్తులతో దాడి చేసి హతమార్చినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 16, 2025

చొప్పదండి: డ్రంక్ అండ్ డ్రైవ్ ఫైన్‌కు భయపడి యువకుడి ఆత్మహత్య

image

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఫైన్ చెల్లించలేనన్న మనోవేదనతో చొప్పదండి బీసీ కాలనీకి చెందిన సూర విజయ్ (28) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ నరేష్ రెడ్డి తెలిపారు. ఈ నెల 1న పోలీసులకు పట్టుబడిన విజయ్, శనివారం కోర్టుకు హాజరైనప్పటికీ మేజిస్ట్రేట్ లేకపోవడంతో తిరిగి వచ్చాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫైన్ భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

News November 16, 2025

KNR: విటమిన్ గార్డెన్ పై దృష్టి పెట్టాలి:కలెక్టర్

image

ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విటమిన్ గార్డెన్లపై బయోసైన్స్ ఉపాధ్యాయులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించి, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. గార్డెన్‌లను ఆకర్షణీయంగా ఏర్పాటు చేయడంతో పాటు, పండిస్తున్న కూరగాయలు, ఆకుకూరల్లోని విటమిన్లు, మినరల్స్‌ గురించి కూడా విద్యార్థులకు వివరించాలని ఆమె సూచించారు.

News November 16, 2025

KNR: ‘కుక్కకాటు బాధితులకు ప్రత్యేక పర్యవేక్షణ అవసరం’

image

కుక్కలు, కోతులు కరిచిన వారికి అందిస్తున్న చికిత్సపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శనివారం హౌసింగ్ బోర్డు కాలనీలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించారు. చికిత్స కోసం వచ్చిన వృద్ధులతో మాట్లాడి, వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇస్తారని వారికి సూచించారు.