News February 26, 2025
గోదావరిఖని: నదిలో వేలాదిమంది భక్తుల పుణ్యస్నానాలు

పవిత్ర మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా గోదావరిఖని పట్టణ శివారు గోదావరి నదిలో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలు పుణ్యస్నానాలు చేసి సమీపంలోని జనగామ త్రిలింగ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. నదిలో నీరు తక్కువ ప్రవహిస్తున్నప్పటికీ భక్తుల రద్దీ ఎక్కువైంది. నదికి వెళ్లే రహదారి రాకపోకలతో జనసంద్రంగా తలపించింది.
Similar News
News March 26, 2025
NLG: ధాన్యం కొనుగోళ్లకు కసరత్తు

నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతేడాది యాసంగిలో ఏప్రిల్ మొదటి వారం వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని రైతుల నుంచి విమర్శలు రాగా.. ఈసారి ఆ సమస్య రాకుండా ముందస్తుగానే జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తుంది. జిల్లాలో ఈ సీజన్లో 11.26 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. 12.14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేశారు.
News March 26, 2025
ALERT: నేడు 108 మండలాల్లో వడగాలులు

AP: రాష్ట్రంలో ఇవాళ 108 మండలాల్లో వడగాలులు వీస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం (15), విజయనగరం (21), మన్యం (10), అల్లూరి (8), అనకాపల్లి (7), కాకినాడ (7), కోనసీమ (3), తూర్పుగోదావరి (13), ఏలూరు (5), కృష్ణా (2), ఎన్టీఆర్ (6), గుంటూరు (3), పల్నాడు జిల్లాలోని 8 మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. అలాగే ఇవాళ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని పేర్కొంది.
News March 26, 2025
ఏలూరు : ముళ్ల పొదల్లో పసికందు.. మృతి

తూ.గో జిల్లాలో పొదల్లో అప్పుడే పుట్టిన ఆడ శిశువును కుక్కలు పీకుతుండగా.. స్థానికులు గుర్తించి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అయితే శిశువు చికిత్స పొందుతూ రా.12 గం.లకు మరణించిందని సీడీపీఓ నాగలక్ష్మి తెలిపారు. ఘటనపై FIR చేయించామని, వివరాల సేకరణకు అంగన్వాడీ సిబ్బందికి ఆదేశాలిచ్చామన్నారు.