News February 19, 2025

గోదావరిఖని: ‘భవిష్యత్ ఆ అరుదైన ఖనిజాలదే..!’

image

భవిష్యత్ ఆ అరుదైన ఖనిజాలదే అని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు. భారతదేశాన్ని 2047 నాటికి అగ్ర స్థాయిలో తీర్చిదిద్దేందుకు రూపొందించుకున్న వికసిత్ లక్ష్యాలను చేరుకోవడంలో మైనింగ్ రంగం పాత్ర అత్యంత కీలకమని, ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో గణనీయమైన పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు.

Similar News

News November 21, 2025

BREAKING: ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక

image

రాష్ట్రంలో 32 మంది IPSలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక, ఉట్నూర్ ఏఎస్పీగా కాజల్ సింగ్ నియమితులయ్యారు. కాజల్ సింగ్ ఇదివరకు ఉట్నూర్ ఎస్డీపీవోగా, మౌనిక ఇదివరకు దేవరకొండ ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ మేరకు వీరు త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.

News November 21, 2025

నిర్మల్‌ ఏఎస్పీగా సాయికిరణ్

image

రాష్ట్రంలో 32 మంది IPSలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మల్ ఏఎస్పీగా సాయికిరణ్, భైంసా ఎస్డీపీవోగా రాజేశ్ మీనా నియమితులయ్యారు. రాజేశ్ మీనా గతంలో నిర్మల్ ఏఎస్పీగా పని చేశారు. ఈ మేరకు వీరు త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.

News November 21, 2025

వనపర్తి నూతన ఎస్పీగా డి.సునీత‌

image

రాష్ట్రంలో ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో నూతన ఎస్పీగా సునీత‌ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే సునీత‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు, పోలీసు వ్యవస్థ బలోపేతానికి ఆమె కృషి చేస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.