News February 19, 2025
గోదావరిఖని: ‘భవిష్యత్ ఆ అరుదైన ఖనిజాలదే..!’

భవిష్యత్ అంతా మైనింగ్ రంగందేనని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు. భారతదేశాన్ని 2047 నాటికి అగ్ర స్థాయిలో తీర్చిదిద్దేందుకు రూపొందించుకున్న వికసిత్ లక్ష్యాలను చేరుకోవడంలో మైనింగ్ రంగం పాత్ర అత్యంత కీలకమని, ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో గణనీయమైన పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు.
Similar News
News February 23, 2026
రైలు ప్రయాణికులకు దొంగల భయం

రైళ్లలో వరుస చోరీలతో ప్రయాణికులు హడలిపోతున్నారు. అనంతపురం జిల్లాలో మూడు రోజుల వ్యవధిలోనే గుత్తి, కల్లూరు వద్ద మైసూర్, లాథూర్ ఎక్స్‌ప్రెస్‌లలో మహిళల మెడలోని బంగారు నగలను దుండగులు అపహరించారు. రాత్రి సమయాల్లో ఎస్కార్ట్ సిబ్బంది కొరత దొంగలకు వరంగా మారింది. రైల్వే పోలీసులు ఏసీ బోగీలలో నిద్రిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి భద్రత పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.
News February 23, 2026
వరంగల్ మున్సిపాలిటీల్లో కోఆప్షన్ కోలాహలం

ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపాలిటీల్లో పాలక వర్గాల ఏర్పాటు ముగియడంతో, ఇప్పుడు అందరి దృష్టి ‘కోఆప్షన్’ సభ్యుల ఎంపికపై పడింది. పట్టణ అభివృద్ధిలో కీలకమైన ఈ నామినేటెడ్ పదవుల కోసం ద్వితీయ శ్రేణి నాయకులు, ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో టికెట్ దక్కని వారు, పార్టీ కోసం శ్రమించిన వారు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని చూస్తున్నారు. దీంతో మున్సిపల్ కార్యాలయాల్లో సందడి నెలకొంది.
News February 23, 2026
కొత్తగూడెంలో తగ్గిన గాలి నాణ్యత.. 136కు చేరిన AQI

కొత్తగూడెం జిల్లాకేంద్రంలో వాయుకాలుష్యం కోరలు చాస్తోంది. ఆదివారం(FEB22) కొత్తగూడెంలో వాయు నాణ్యత సూచీ(AQI) ఒక్కసారిగా 136కు చేరింది. గాలిలో PM2.5, PM10 వంటి సూక్ష్మ ధూళి కణాలు ప్రమాదకర స్థాయికి చేరడమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. గాలి నాణ్యత అనారోగ్యకర స్థాయికి చేరడంతో చిన్నారులు,వృద్ధులు శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. 100 లోపు AQI ఉంటే నాణ్యమైన గాలిగా తేల్చారు.


