News February 26, 2025

గోదావరిఖని: ‘AIFTU రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు విజయవంతం’

image

గోదావరిఖనిలో ఇటీవల జరిగిన AIFTU రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు విజయవంతం చేసినందుకు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర నాయకుడు మాతంగి రాయమల్లు మాట్లాడుతూ.. అన్ని వర్గాల కార్మికుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటాలు చేస్తామన్నారు. నాయకులు గొల్ల అంజయ్య, రత్నకుమార్, రాములు, పోచమల్లు, రామస్వామి, యాకయ్య, పల్లె లింగయ్య, జనగాం చిన్నయ్య ఉన్నారు.

Similar News

News December 2, 2025

గొర్రెలకు సంపూర్ణ ఆహారం ఎలా అందుతుంది?

image

గొర్రెలకు మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు, విటమిన్లతో కూడిన సంపూర్ణ దాణా(ఆహారం) అందేలా జాగ్రత్త వహించాలి. అప్పుడే గొర్రె మందలు ఆరోగ్యంగా పెరుగుతాయి. మంచి దాణా వల్ల గొర్రెల్లో పునరుత్పత్తి సామర్థ్యం పెరిగి వాటి మందలు వృద్ధిచెంది, పెంపకందారులకు అధిక ఆదాయం అందిస్తాయి. సరైన పోషకాహారం అందని తల్లి గొర్రెల వద్ద పిల్లలకు సరిపోను పాలుండకపోతే పిల్లలు సరిగా ఎదగక మరణిస్తాయి.

News December 2, 2025

వరంగల్: గుర్తులు రెడీ.. నోటా టెన్షన్..!

image

జిల్లాలో పంచాయతీ ఎన్నికల మొదటి విడతలో నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. ఉపసంహరణ తర్వాతే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. సర్పంచ్ స్థానానికి 30, వార్డు సభ్యులకు 20కి పైగా గుర్తులు కేటాయించారు. సర్పంచ్‌కు గులాబీ బ్యాలెట్, వార్డు సభ్యులకు తెలుపు బ్యాలెట్‌ను నిర్ణయించారు. బ్యాలెట్‌లో నోటా చేరడంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.

News December 2, 2025

NGKL: సర్పంచ్ ఎన్నికలు.. బరిలో నిలిచేదేవరో, తప్పుకునేదెవరో..?

image

NGKL జిల్లాలో దాదాపు రెండేళ్ల తర్వాత జరుగుతున్న సర్పంచ్‌ ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కొన్ని గ్రామాల్లో ఒకే పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు ఆశావహులు నామినేషన్లు వేయడంతో నాయకులకు తలనొప్పిగా మారింది. ఓట్లు చీలకుండా నివారించేందుకు.. ఒక్కరినే బరిలో దించడానికి, నామినేషన్ల ఉపసంహరణకు నేతలు బుజ్జగింపులు మొదలుపెట్టారు. రేపటితో తొలి విడతలో బరిలో నిలిచేది ఎవరో తేలనుంది.