News September 22, 2024
గోదావరిలోకి దూకి యువకుడు గల్లంతు
గోదావరిలో దూకి వ్యక్తి గల్లంతయిన ఘటన శనివారం కొవ్వూరులో చోటుచేసుకుంది. చాగల్లు గ్రామానికి చెందిన బొల్లిపో రఘు (29) డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక మనస్తాపానికి గురై కొవ్వూరు రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపైకి వచ్చి అక్కడ బైక్ పార్క్ చేసి అందరూ చూస్తుండగానే గోదావరిలోకి దూకేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.
Similar News
News October 14, 2024
ఏలూరు ఎస్పీ పరిష్కార వేదికకు 45 ఫిర్యాదులు
ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి 45 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వాటిని సమగ్రంగా విచారించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
News October 14, 2024
నరసాపురం: మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దు
సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని నరసాపురం ఆర్డీవో దాసి రాజు మత్స్యకారులకు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సముద్ర అలలు ఎగసి పడుతాయని, మళ్లీ ప్రకటన వెలువడే వరకూ చేపల వేటకు వెళ్లొద్దని పేర్కొన్నారు. అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వారికి హెచ్చరికలు జారీ చేశారు.
News October 14, 2024
బందోబస్తును పరిశీలించిన ఏలూరు ఎస్పీ
ఏలూరు జిల్లా వైన్స్ లాటరీ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన చలసాని గార్డెన్లోని బందోబస్తు ప్రదేశాన్ని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదివారం సందర్శించారు. పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, ఎక్సైజ్ శాఖ అధికారులు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.