News February 28, 2025

గోదావరిలో గల్లంతైన యవకులు మృతి

image

భద్రాచలం గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయిన విషయం తెలిసిందే. అయితే గల్లంతయిన ఇద్దరు యువకులు మృతి చెందారు.జ వారి మృతదేహాలను గజఈతగాళ్లు వెలికి తీశారు. మృతులు పవన్(20), హరి ప్రసాద్‌(18) గా పోలీసులు గుర్తించారు.

Similar News

News November 7, 2025

జాతీయ స్థాయి క్రికెట్‌కు మద్దికేర విద్యార్థి ఎంపిక

image

మద్దికేరకు చెందిన కాలువ శ్రీరాములు, లక్ష్మీ కుమారుడు యువరాజు ఫాస్ట్ బౌలర్‌గా జాతీయ స్థాయి క్రికెట్‌కు ఎంపికయ్యాడు. ఈ మేరకు ఆయన తల్లిదండ్రులు గురువారం తెలిపారు. ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-19 విభాగంలో మంచి ప్రదర్శన చూపడంతో జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. యువరాజ్ ఇంటర్ చదువుతున్నాడు. కరస్పాండెంట్ యజ్ఞం మాధవ్, ప్రిన్సిపల్ సునీత, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

News November 7, 2025

మంత్రాల వల్ల నిజంగానే ఫలితం ఉంటుందా?

image

మంత్రాల శక్తిని కొందరు నమ్మకపోయినా, అవి నిజంగానే సానుకూల ప్రభావాన్ని చూపుతాయని అనేక నివేదికలు తెలియజేస్తున్నాయి. మంత్రాలను పదే పదే జపించడం ధ్యానంలాగా పనిచేస్తుంది. ఈ ప్రక్రియలో మనస్సు మంత్రంపై కేంద్రీకృతమై ఏకాగ్రత పెరుగుతుంది. మంత్ర జపంతో ఉత్పన్నమయ్యే లయబద్ధ శబ్ద తరంగాలు మనలో మానసిక ప్రశాంతతను పెంచి, ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫలితంగా మనలో సానుకూల శక్తి పెరిగి, జీవితం పట్ల మంచి దృక్పథం కలుగుతుంది.

News November 7, 2025

చరిత్ర సృష్టించిన శీతల్.. సాధారణ ఆర్చర్లతో పోటీ

image

పారా కాంపౌండ్ ఆర్చరీలో శీతల్ దేవి వరల్డ్ ఛాంపియన్‌గా నిలవడమే కాకుండా అనేక పతకాలు గెలిచారు. ఆమె ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించారు. సాధారణ ఆర్చర్లతో కలిసి ఆసియా కప్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. జెడ్డా వేదికగా జరగనున్న ఆసియా కప్ స్టేజ్-3లో పోటీ పడే భారత జట్టుకు ఎంపికయ్యారు. సాధారణ ఆర్చర్ల జట్టులోకి పారా ఆర్చర్ ఎంపికవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. ట్రయల్స్‌లో ఆమె ఓవరాల్‌గా 3వ స్థానంలో నిలిచారు.