News January 25, 2025
గోదావరిలో గుర్తు తెలియని మృతదేహం

రావులపాలెం – జొన్నాడ బ్రిడ్జిల మధ్య గోదావరి నదిలో శనివారం గుర్తు తెలియని పురుషుని మృతదేహం లభ్యమైందని ఎస్ఐ చంటి తెలిపారు. మృతుడు 5 అడుగుల పొడవు కలిగి ఒంటిపై ఎరుపు రంగు షర్టు, అపోలో టైర్ టీ షర్ట్, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని తెలిపారు. వయసు సుమారు 35- 40 సంవత్సరాలు ఉండొచ్చని, మృతుని వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Similar News
News January 7, 2026
గుంటూరు: ఫిబ్రవరిలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ

గుంటూరులో అగ్నివీర్ సైనిక నియామక ప్రక్రియను వచ్చే ఫిబ్రవరి 17-27 మధ్య నిర్వహించనున్నట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని కేంద్రంగా చేసుకుని పదిరోజులకు పైగా ర్యాలీ కొనసాగనుంది. ఏపీ, తెలంగాణకు చెందిన అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చు. వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీ జరగనుండగా, దశలవారీగా శారీరక, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ముందస్తుగా ఆన్లైన్ నమోదు పూర్తి చేయాలి.
News January 7, 2026
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధర భారీగా పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.12,000 పెరిగి రూ.2,83,000కు చేరింది. మూడు రోజుల్లోనే రూ.26వేలు పెరగడం గమనార్హం. అటు 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.660 పెరిగి రూ.1,39,480గా ఉంది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.600 ఎగబాకి రూ.1,27,850 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News January 7, 2026
నల్గొండ: రూ.10వేల నుంచి రూ.40కోట్లకు!

నల్గొండ మున్సిపాలిటీ అరుదైన మైలురాయిని చేరుకుంది. 74 ఏళ్ల క్రితం కేవలం రూ.10 వేల వార్షిక బడ్జెట్తో ప్రారంభమైన ఈ మున్సిపాలిటీ ఆదాయం, నేడు రూ. 40 కోట్లకు పైగా పెరిగింది. వలసలు పెరగడంతో పట్టణ జనాభా ప్రస్తుతం 2.5 లక్షలు దాటింది. జనాభాకు అనుగుణంగా పట్టణం శరవేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు చిన్న ఆదాయ వనరుగా ఉన్న మున్సిపాలిటీ, నేడు కోట్ల ఆదాయంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది.


