News July 19, 2024

గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఒకరు గల్లంతు

image

గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లి ఓ వ్యక్తి గల్లంతైన ఘటన వెంకటాపురం మండలంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపురం మండలం ఆలుబాకకి చెందిన బానారి రాజు (45) ఈరోజు మధ్యాహ్నం చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. స్థానికులు ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Similar News

News October 11, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> బోనకల్ మండలం లక్ష్మీపురానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాక
> రఘునాథపాలెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
> ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన
> సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
> పెనుబల్లిలో సీపీఎం మండల కమిటీ సమావేశం
> అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
> ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
> నవరాత్రుల్లో భాగంగా వీరలక్ష్మి అవతారంలో అమ్మవారు

News October 11, 2024

ఖమ్మం: రూ.300 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు

image

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకురాబోతున్న ఇంటిగ్రేటెడ్ విద్యావిధానంలో భాగంగా జిల్లాలో మూడు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శుక్రవారం శంకుస్థాపన జరగనుంది. ఒక్కో విద్యాలయానికి రూ.100 కోట్ల చొప్పున ముగ్గురు మంత్రుల నియోజకవర్గాల్లో రూ.300 కోట్లతో విద్యాలయాల నిర్మాణం కాబోతున్నాయి. హైస్కూళ్లతో పాటు ఇంటర్ విద్యాబోధనతో అన్నికులాల విద్యార్థులకు ఒకే చోట, ఒకే తరహా విద్యాబోధన అందనుంది.

News October 11, 2024

KMM: ‘ఆదాయ పెంపు మార్గాలపై దృష్టిని సారించాలి’

image

రాష్ట్ర వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయ పెంపు మార్గాలపై దృష్టిని సారించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదాయం సమకూర్చే శాఖల లక్ష్యాలపై సీఎం, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. వార్షిక లక్ష్యాలను చేరుకోవడంలో శాఖల పనితీరును మెరుగు పరుచుకోవాలని చెప్పారు. సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉన్నారు.