News September 6, 2024
గోదావరిలో దూకి కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
గోదావరిలో దూకి ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం భద్రాచలంలో జరిగింది. స్థానిక పాత బ్రిడ్జిపై నుంచి పాల్వంచకు చెందిన కానిస్టేబుల్ రమణ రెడ్డి గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 10, 2024
దసరాకు వంతెనపై రాకపోకలు ప్రారంభించాలి: మంత్రి తుమ్మల
దసరా పండుగ లోపు ప్రకాశ్ నగర్ బ్రిడ్జి దగ్గర పాత లోలెవల్ కాజ్ వే డైవర్షన్ రోడ్డు పనులు పూర్తి చేసి, రాకపోకలు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలోని 28వ డివిజన్ ప్రకాశ్ నగర్‌లో పర్యటించి టీ.యూ.ఎఫ్.ఐ.డి.సి. నిధులు రూ.కోటి 90 లక్షలతో చేపట్టిన స్టార్మ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులు ప్రారంభించారు.
News October 10, 2024
భారత పారిశ్రామిక చరిత్రలో రతన్ ఓ శకం: మంత్రి పొంగులేటి
భారత పారిశ్రామిక చరిత్రలో రతన్ టాటా ఓ శకం అని ఆయన మృతి ప్రపంచానికే తీరని లోటని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ రోజు దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. వారి నిష్క్రమణ పారిశ్రామిక రంగం, యావత్ దేశానికే కాకుండా ప్రపంచానికి కూడా తీరని లోటని పేర్కొన్నారు.
News October 10, 2024
ఖమ్మం: ప్రత్యేక ఆకర్షణగా 51 అడుగుల బతుకమ్మ
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. కూసుమంచి మండలం పరిధిలోని పెరిక సింగారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు ఆధ్వర్యంలో తయారుచేసిన 51 అడుగుల భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతి ఏటా ఈ గ్రామంలో బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా జరుగుతాయి. గురువారం సాయంత్రం జరగబోయే బతుకమ్మ వేడుకలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరవుతారని జూకూరి గోపాలరావు తెలిపారు.