News April 1, 2025

గోదావరిలో దూకేసిన వ్యక్తి మృతదేహం లభ్యం

image

అప్పుల భారంతో అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామంలోని వైనతేయ వారధిపై కారును నిలిపి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న అమలాపురానికి చెందిన చోడపనీడి వెంకటేశ్వరరావు (61) మృతదేహం సోమవారం లభ్యమైంది. అంబాజీపేట మండలం తొండవరం గ్రామ పరిధిలో గోదావరి నది ఒడ్డున అతని మృతదేహాన్ని గుర్తించారు. వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అల్లవరం పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు.

Similar News

News February 25, 2026

MBNR: పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

image

మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. పదో తరగతి పరీక్ష ఏర్పాట్ల విషయమై జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాలలోకి ఎటువంటి సెల్‌ఫోన్లు, గాడ్జెట్‌లకు అనుమతి లేదన్నారు. పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతుందన్నారు.

News February 25, 2026

సంగారెడ్డి: ‘ఏటీసీ సెంటర్లతో ఉజ్వల భవిష్యత్తు’

image

ఆధునిక సాంకేతికతతో ప్రభుత్వం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను(ATC) ఏర్పాటు చేసిందని డైరెక్టర్ కాంతి వెస్లీ తెలిపారు. బుధవారం సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐలో కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి ‘ఆన్-ది-జాబ్ ట్రైనింగ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడ శిక్షణ పొందే విద్యార్థులు కేవలం ఉద్యోగులుగానే కాకుండా, భవిష్యత్తులో గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.

News February 25, 2026

ప్రశాంతంగా తొలిరోజు ఇంటర్ పరీక్షలు: DIEO

image

జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా మొదలైనట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి మదార్ గౌడ్ తెలిపారు. అన్ని మండలాల్లో మొత్తం 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ కేటగిరి 3317 విద్యార్థులకు, 3237 విద్యార్థులు, ఒకేషనల్ 1042 విద్యార్థులకు 955 విద్యార్థులు మొత్తం 4359 విద్యార్థుల గాను 4192 మంది హాజరైనట్లు పేర్కొన్నారు.