News January 28, 2025
గోదావరి కరకట్ట నిర్మాణం వేగవంతం చేయాలి: మంత్రి

HYD ఎర్రమంజిల్ జల సౌధలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, సీతక్క ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. ములుగులోని పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు, ఫ్లడ్ కెనాల్ పనులు, గోదావరి కరకట్ట నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, లక్నవరం నుంచి రామప్ప కెనాల్ నిర్మాణం కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని చెప్పారు.
Similar News
News February 14, 2025
రీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి: జాయింట్ కలెక్టర్

పకడ్బందీగా రీ సర్వే జరిగేలా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం సంబేపల్లి తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామస్థాయిలో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు సదస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
News February 14, 2025
నిర్మల్: ‘అలేఖ్య కేసులో మిగిలిన వారికి కూడా శిక్ష పడాలి’

అలేఖ్య కేసులో మిగిలిన వారికి కూడా శిక్ష పడాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు శుక్రవారం నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిలను వారి కార్యాలయంలో కలిసి విన్నవించారు. బాధితులు మాట్లాడుతూ.. అలేఖ్య హత్య కేసులో నిందితుడికి బుధవారం కోర్టు శిక్ష విధించిందని, అందుకు కారణమైన మిగతా ఇద్దరికీ శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్పీ స్పందిస్తూ హైకోర్టులో అపీలు చేస్తామని తెలిపారు.
News February 14, 2025
ప్రేమికుల రోజు భార్యలతో క్రికెటర్లు!

వాలంటైన్స్ డే సందర్భంగా పలువురు క్రికెటర్లు తాము ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యలతో గడిపారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలితో కలిసి స్పెషల్ లంచ్‌కు వెళ్లిన ఫొటోను షేర్ చేశారు. మరో కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇద్దరూ కలిసి షాపింగ్ చేస్తూ సందడిగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.