News September 14, 2024

గోదావరి నది బ్రిడ్జిపై నిమజ్జనానికి ఏర్పాట్లు

image

గోదావరిఖని శివారు గోదావరి నది బ్రిడ్జిపై వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించారు. రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో MLA రాజ్ ఠాకూర్ చొరవతో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈనెల 16న ఉదయం నుంచి సాయంత్రంలోగా నిమజ్జనం పూర్తి చేయాలని గణేశ్ నవరాత్రి ఉత్సవాల నిర్వాహకులకు అధికారులు సూచిస్తున్నారు. అధికారుల సూచన మేరకు బ్రిడ్జిపై నుంచి గణపతి విగ్రహాలను నిమజ్జనం చేయాలని పేర్కొంటున్నారు.

Similar News

News November 26, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కరీంనగర్ ప్రజావాణికి 193 ఫిర్యాదులు. @ జగిత్యాల కలెక్టరేట్ ఎదుట ఏఎన్ఎంల నిరసన. @ రాజన్న సిరిసిల్ల జిల్లాలో బాలికను వేధించిన ఆరుగురికి జైలు శిక్ష. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ కోరుట్ల పట్టణంలో తాళం వేసిన ఇంట్లో చోరీ. @ జగిత్యాల జిల్లాలో ఇద్దరు పాఠశాల ఫుడ్ ఇన్చార్జిల సస్పెండ్. @ మల్లాపూర్ మండలంలో శివాలయం నిర్మాణానికి శంకుస్థాపన.

News November 25, 2024

పెద్దపల్లి: 1200 ఏళ్ల నాటి శివాలయం! 

image

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్‌లో శ్రీ సాంబ సదాశివ ఆలయం ప్రాచీన కాలం నాటిది. ఈ ఆలయాన్ని కాకతీయుల కాలంలో 16 స్తంభాలతో నిర్మించారు. దాదాపు ఈ గుడికి 1200 ఏళ్ల చరిత్ర ఉందని చరిత్రకారుల అంచనా. గుడి వెనక భాగంలో కొలను ఉంది. అందులో నూరు చిన్న కొలనులు ఉన్నాయని అందుకే ఈ గ్రామానికి కొలనూరు అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. ప్రస్తుతం ఈ ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

News November 24, 2024

జగిత్యాల: 120 మంది శ్రీనివాసుల ఆత్మీయ సమ్మేళనం

image

జగిత్యాల జిల్లాలోని వాట్సాప్ గ్రూప్ ద్వారా కలుసుకున్న 120 మంది శ్రీనివాసులు స్థానిక నారాయణ దాసు ఆశ్రమంలో ASI రాజేశుని శ్రీనివాస్ ఆధ్వర్యంలో 120 మంది శ్రీనివాసులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు పరిచయ కార్యాచరణ నిర్వహించి, పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. 2025లో మొదటివారం శ్రీనివాసులంతా కలిసి నిర్వహించే మహా సభను విజయవంతం చేయాలని కోరారు.