News September 11, 2024
గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని, దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారని ప.గో కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ నేపథ్యంలో వశిష్ట గోదావరి వద్ద నీటిమట్టం పెరుగుతుందని, లంక గ్రామాలు, పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. అత్యవసరమైతే తప్ప బోట్ల ద్వారా రాకపోకలు సాగించవద్దని హెచ్చరించారు.
Similar News
News October 14, 2025
ఆకివీడు: రైలు నుంచి జారిపడి వృద్ధుడు మృతి

ఆకివీడు – పల్లెవాడ రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం గుర్తు తెలియని వృద్ధుడు (సుమారు 60 సం.) రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. మృతుడిని గుర్తించిన వారు లేదా వివరాలు తెలిసిన వారు రైటర్ రాజాబాబు (9705649492) కి తెలపాలని జీఆర్‌పీఎఫ్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 14, 2025
భీమవరం: అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్న కార్తీక మాసం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ నాగరాణి పీజీఆర్‌ఎస్‌లో దేవాదాయ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్తీక మాసంలో దేవాలయాలు శోభాయమానంగా ఉండేలా సిద్ధం చేయాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. పేరుపాలెం బీచ్ వద్ద సముద్ర స్నానాల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
News October 13, 2025
భీమవరం: నేటి పీజీఆర్ఎస్‌కు 95 అర్జీలు

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 95 అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.