News February 27, 2026
గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

2027 గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. గురువారం మంత్రుల బృందం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. జిల్లాలో ఉన్న 20 ఘాట్లకు అదనంగా మరో 16 కొత్త ఘాట్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. పాత వాటిలో రెండింటిని మరింత విశాలంగా తీర్చిదిద్దుతున్నామని, భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రణాళికాబద్ధంగా పనులు చేపడతామని కలెక్టర్ వివరించారు.
Similar News
News April 14, 2026
29న క్యాబినెట్ భేటీ.. మున్సిపల్ ఎన్నికలపై చర్చ!

AP: ఈనెల 29న వెలగపూడి సచివాలయంలో CM CBN అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈమేరకు ప్రతిపాదనలతో నివేదికలు పంపాలని CS అన్ని శాఖలకు సర్క్యులర్ జారీచేశారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు, అమరావతి రెండో దశ భూ సమీకరణ, తొలిదశ సేకరించిన భూముల్లో పనుల పురోగతి, వివిధ సంస్థలకు భూముల కేటాయింపు, ఎంఓయూల మేరకు వివిధ సంస్థల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించనున్నారు.
News April 14, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,300
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14.076
*వెండి 10 గ్రాముల ధర రూ.2,470
News April 14, 2026
అరుణాచల్ ప్రదేశ్ మాదే: చైనా

అరుణాచల్ ప్రదేశ్‌లో <<19633032>>గ్రామాల<<>> పేర్లు మార్చడంపై భారత్ నుంచి విమర్శలు ఎదుర్కొన్నా చైనా తగ్గడం లేదు. అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగమే కాదని లేటెస్ట్‌గా ఆ దేశ విదేశాంగ ప్రతినిధి జియాకున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్ అక్రమంగా ఏర్పాటు చేసుకుందని, దీనిని చైనా ఎప్పటికీ గుర్తించదన్నారు. అరుణాచల్‌ను జాంగ్‌నాన్ (దక్షిణ టిబెట్)గా పేర్కొంటూ.. ఇది తమ భూభాగమేనని చైనా వాదిస్తోంది.


