News September 5, 2024

గోదావరి వరద.. రెస్క్యూ ఆపరేషన్‌కు రెడీ: RDO

image

గోదావరి వరదతో వేలేరుపాడు మండలములోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించేందుకు 15 మోటర్ బోట్లు, 30 ట్రాక్టర్లు ఏర్పాటు చేశామని ఆర్డీవో ఆదయ్య అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ముంపు ప్రజలను తరలించడానికి 24 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం, 20 మంది స్పెషల్ పార్టీ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి రెడీగా ఉన్నారన్నారు. మరింత సహాయార్థం టోల్ ఫ్రీ నెం. 8919936844 ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News September 16, 2025

ఉమ్మడి ప.గో జిల్లాలో 1063 మందికి టీచర్ ఉద్యోగాలు

image

ఉమ్మడి ప.గో జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు 1063 మందిని విద్యాశాఖ ఎంపిక చేసింది. ప్రభుత్వ, జడ్పీ, గిరిజన సంక్షేమ శాఖ, జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ల స్కూళ్లలో మొత్తంగా 1074 పోస్టులు నోటిఫై చేయగా.. వీటిలో 1063 పోస్టులకు మెరిట్ కమ్ రిజర్వేషన్ రోస్టర్ నిబంధనల మేరకు అభ్యర్థులను ఖరారు చేశారు. 11 పోస్టులకు అర్హులు లేకపోవడంతో వాటిని భర్తీ చేయలేదు. ఎంపికైన వారిలో 534 మంది పురుషులు, 529 మంది మహిళలున్నారు.

News September 16, 2025

219 అర్జీలు సత్వరమే పరిష్కరించండి: జేసీ

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి 219 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News September 16, 2025

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 9 అర్జీలు: ఎస్పీ

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీలు పునరావృతం కాకుండా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మీ అన్నారు. పాలకోడేరు మండలం గరగపర్రులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా వేదికకు 9 అర్జీలు వచ్చాయన్నారు. వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు.