News January 17, 2025

గోనెగండ్లలో విషాదం

image

కర్నూలు జిల్లా గోనెగండ్లలో మందు బాబులు ఓ వ్యక్తి ప్రాణం తీశారు. పూటుగా తాగి బైక్‌పై వెళ్తూ స్టేట్ బ్యాంక్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న ఆటో డ్రైవర్ రమేశ్‌ను ఢీకొన్నారు. తలకు తీవ్ర గాయం కావడంతో బంధువులు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న రమేశ్ కోలుకోలేక శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. మృతుడికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటన ఆ ఇంట విషాదం నింపింది. 

Similar News

News October 21, 2025

ప్రాథమిక స్థాయిలోనే ఆంగ్ల భాషపై దృష్టి పెట్టండి: కలెక్టర్

image

ప్రాథమిక స్థాయిలోనే ఆంగ్ల భాషపై దృష్టి సారించాలని, అందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. మంగళవారం జిల్లా విద్యాధికారి శామ్యూల్ పాల్‌తో పాటు విద్యాశాఖ అధికారులతో పూర్వ ప్రాథమిక విద్యపై కలెక్టర్ సమీక్ష చేశారు. ప్రాథమిక విద్యలోనే ఆంగ్ల భాష నైపుణ్యాలను విద్యార్థులకు అందించేందుకు 20 మంది రిసోర్స్ పర్సన్లను నియమించాలన్నారు.

News October 21, 2025

రైతు సంక్షేమంపై దృష్టి సారించండి: కలెక్టర్

image

వ్యవసాయ సహాయక శాఖల పనితీరు, రైతులకు అందిస్తున్న సేవలపై కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మంగళవారం మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో అగ్రికల్చర్ అల్లయిడ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో వ్యవసాయ, పశుసంవర్ధక, పాల, మత్స్య, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. రైతులకు సమయానికి విత్తనాలు, ఎరువులు, సబ్సిడీ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

News October 21, 2025

పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ పనులు చేయాలి: కలెక్టర్

image

నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఏపీఐఐసీ జడ్ఎంను కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్‌లో ప్రాజెక్టులు, భూ సేకరణ అంశాలపై ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులతో ఆమె సమీక్షించారు. 3 కిలోమీటర్ల మేర భూ సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.