News March 22, 2024

గోనెగండ్లలో విషాదం.. ఈతకు వెళ్లి బాలుడి మృతి

image

గోనెగండ్లలోని లక్ష్మీపేటలో జరిగే ఒక పెళ్లికి ఎమ్మిగనూరు మండలం మల్కాపురానికి చెందిన ఎల్లారెడ్డి కుటుంబంతో పాటు వారి కుమారుడు అరుణ్ కుమార్(6) వచ్చాడు. పెళ్లి సందడిలో ఉండగా అరుణ్ కుమార్ కొంతమంది పిల్లలతో కలిసి సమీపంలోని ఎల్‌ఎల్‌సీ కాలువలో ఈతకు వెళ్లాడు. ఈతకు దిగి ప్రమాదవశాత్తు నీట మునిగిపోయాడు. స్థానికులు బాలుడిని వెలికితీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Similar News

News September 13, 2024

పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలి: నంద్యాల కలెక్టర్

image

గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను మెరుగ్గా చేపట్టాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ కలెక్టర్లతో నిర్వహించిన వీసీలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లా, మండల, గ్రామ పంచాయితీ అధికారులు గ్రామాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందకుండా చూడాలన్నారు.

News September 13, 2024

శ్రీమఠంలో సినీ నటుడు లారెన్స్‌

image

శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్‌ రాఘవ లారెన్స్ గురువారం మంత్రాలయానికి వచ్చారు. ఆయనకు శ్రీ మఠం అధికారులు ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించారు. ముందుగా గ్రామదేవత శ్రీ మంచాలమ్మ దేవిని, గురు రాయల బృందావనాన్ని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ మఠం పీఠాధిపతులు ఫలమంత్రాక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు.

News September 12, 2024

ఆవులగడ్డ నుంచి ఆళ్లగడ్డ!

image

ఆళ్లగడ్డను పూర్వం ‘ఆవులగడ్డ’ అని పిలిచేవారట. కాలక్రమేణా ఆ పేరు ఆళ్లగడ్డగా మారింది. శిల్పకళా రంగంలో ఆళ్లగడ్డ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇక్కడి శిల్పులకు కటిక రాతికి జీవకళ పోయడం ఉలితో పెట్టిన విద్య. స్థానిక దురుగడ్డ వంశీకులు 300 ఏళ్ల క్రితం శిల్పాల తయారీకి శ్రీకారం చుట్టగా నేటికీ ఇదే వృత్తిపై వందల మంది జీవిస్తున్నారు. ఆళ్లగడ్డలో తయారు చేసిన విగ్రహాలు ఇతర దేశాలకూ ఎగుమతి అవుతుంటాయి.