News March 16, 2025
గోపన్ పేట: బీజేపీ జెండా ఆవిష్కరించిన ఎంపీ

మధునాపూర్ మండలం గోపన్ పేటలో శనివారం మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ గ్రామంలోని బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి, గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఇతర పార్టీలకు చెందినవారు బీజేపీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపన్ పేట బూత్ అధ్యక్షులు నాగరాజు, ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 20, 2025
కరీంనగర్: రూ.253.56 కోట్ల మందు తాగేశారు

మూడు విడతల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో లిక్కర్ ఏరులై పారింది. మొదటి విడత నామినేషన్లు మొదలుకొని చివరి విడత రిజల్ట్ వరకు పల్లెలు మద్యం నిషాతో మత్తెక్కాయి. ఉమ్మడి KNRలో 2025 DEC 1-19 మధ్య కేవలం 19 రోజుల్లో రికార్డు స్థాయిలో రూ.253.56 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. KNR రూ.89.89 కోట్లు, PDPL రూ.58.30 కోట్లు, SRCL రూ.42.83 కోట్లు, JGTL రూ.62.54 కోట్ల మందు IML డిపో నుండి డిస్పాచ్ అయింది.
News December 20, 2025
సింగరాయకొండ: చెరువులో యువకుడి మృత దేహం లభ్యం

సింగరాయకొండ మండలం సోమరాజు పల్లి పరిధిలోని మర్రి చెరువులో శనివారం గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్థుల సాయంతో మృతదేహాన్ని వెలికి తీయించారు. చనిపోయిన వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై మహేంద్ర తెలిపారు. మృతిని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 20, 2025
బడ్జెట్‌పై ఊహాజనిత అంచనాలు వద్దు: GOVT

TG: FY26-27 బడ్జెట్‌కు ఊహాజనిత అంచనాలు పంపొద్దని ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. ‘ఖర్చు హేతుబద్ధంగా ఉండాలి. ఎక్కువ/తక్కువలు లేకుండా వాస్తవ రిక్వైర్మెంట్ మాత్రమే పంపాలి. అవసరం మేరకే మెయింటెనెన్స్, రెంట్, వాహనాలకు ఖర్చు చేయాలి’ అని ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ స్టాఫ్ విషయంలో రేట్ కాంట్రాక్ట్, కాలం, ఎంతమంది అవసరం, ఖర్చు అంశాలు HRM నిబంధనల ప్రకారమే ఉండాలని సూచించింది.


