News June 3, 2024
గోపాలపట్నం: రైలు నుంచి జారిపడి యువకుడి మృతి
గోపాలపట్నం రైల్వే స్టేషన్లోని ఫ్లాట్ ఫారం నంబర్-2లో సోమవారం రైలు నుంచి జారిపడి ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు యశ్వంత్ పూర్కు వెళ్ళే రైలు నుంచి జారిపడి ఉంటాడని స్థానికులు, అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 17, 2024
పరవాడ ఎస్ఐ సస్పెండ్
పరవాడ ఎస్ఐ ఎం. రామారావు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు డీఐజీ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలల క్రితం నాతవరం నుంచి రామారావు బదిలీపై పరవాడ వచ్చారు. నాతవరం ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలో ఓ సివిల్ తగాదాలలో తలదూర్చిన కారణంగా రామారావు సస్పెండ్ చేసినట్లు తెలిసింది. సివిల్ తగాదాకు సంబంధించి ఓ మహిళ డీఐజీకి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ నిర్వహించి సస్పెండ్ చేశారు.
News November 17, 2024
దమ్ముంటే ముందు హామీలు అమలు చెయ్: అరకు ఎంపీ
సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ పేరిట మోసం చేశారంటూ వైఎస్.జగన్ అన్నారు. ఈ వీడియోను అరకు ఎంపీ గుమ్మా తనూజారాణి తన ‘x’ అంకౌంట్లో అప్లోడ్ చేశారు. ఈ పోస్టపై ‘@ncbn నీకు దమ్ముంటే ముందు హామీలు అమలు చెయ్. చేతకాకుంటే పదవి నుంచి తప్పుకో. అంతేకానీ ప్రశ్నించే వాళ్లను జైలులో పెట్టి హీరోనని ఫీల్ అయిపోతే ఎలా?’ అంటూ రాసుకొచ్చారు.
News November 17, 2024
విశాఖ: ‘గంజాయి స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనానికి చర్యలు’
గంజాయి స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనానికి పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఉత్తరాంధ్రలో 8 జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులతో విశాఖ పోలీస్ రేంజ్ కార్యాలయంలో డీఐజీ గోపీనాథ్ జెట్టి సమావేశం నిర్వహించారు. గంజాయి సాగుకు ఆర్థికంగా మద్దతిస్తున్న వ్యాపారులపైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీనిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.