News June 3, 2024
గోపాలపట్నం: రైలు నుంచి జారిపడి యువకుడి మృతి
గోపాలపట్నం రైల్వే స్టేషన్‌లోని ఫ్లాట్ ఫారం నంబర్-2లో సోమవారం రైలు నుంచి జారిపడి ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు యశ్వంత్ పూర్‌కు వెళ్ళే రైలు నుంచి జారిపడి ఉంటాడని స్థానికులు, అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 16, 2024
విశాఖ-దుర్గ్ వందేభారత్ టైమింగ్స్ ఇవే
విశాఖ నుంచి దుర్గ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వారంలో గురువారం మినహా ఆరు రోజులు నడపనున్నారు. 20829 నంబర్‌తో దుర్గ్‌లో ఉ.5:45కి బయలుదేరి అదే రోజు మ.1:45 నిమిషాలకు విశాఖ చేరుకుంటుంది. విశాఖ నుంచి 20830 నంబర్‌తో మ.1:50 నిమిషాలకు బయలుదేరి అదే రోజు రాత్రి 11:50 నిమిషాలకు దుర్గ్ చేరుకుంటుంది. ఈనెల 20వ నుంచి ఈ రైలు రెగ్యులర్‌గా తిరుగుతుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే డీఆర్ఏం తెలిపారు.
News September 16, 2024
జీకే.వీధి: పచ్చకామెర్లతో విద్యార్థిని మృతి.?
గూడెం కొత్తవీధి మండలంలో మరో విషాదం నెలకొంది. ఆర్వీ నగర్ బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థిని జంపారంగి.ధార అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం విశాఖ కేజీహెచ్‌లో చేరింది. అక్కడ చికిత్స పొందుతూ.. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచినట్లు టీడీపీ నేత సత్తిబాబు తెలిపారు. పచ్చకామెర్లతో బాలిక మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
News September 16, 2024
అరకులోయ: మళ్లీ పెరిగిన అల్లం ధరలు
అల్లం ధర మళ్లీ పెరిగింది. ఇటీవల మన్యంలో వర్షాలు అధికంగా పడటంతో అల్లం పంట దెబ్బతింది. దీంతో దిగుడులు తగ్గి డిమాండ్ ఏర్పడింది. జూన్, జులై నెలల్లో అల్లం ధర కేజీ రూ.150 ఉండగా ఆ తరువాత కేజీ రూ.120 నుంచి రూ.130కి తగ్గింది. ప్రస్తుతం చింతపల్లిలో కేజీ రూ.200కు విక్రయిస్తున్నారు. త్వరలో కొత్త అల్లం మార్కెట్లోకి వస్తుంది. ఇది వస్తే ధరలు తగ్గే అవకాశం ఉంది.