News October 16, 2024

గోపాలపురం: బైకు కొని కన్నవారికి చూపించాలని వెళ్తూ మృతి

image

గోపాలపురం శివారు జాతీయ రహదారిపై మంగళవారం లారీ ఢీకొని బొర్రంపాలెం గ్రామానికి చెందిన గణేశ్ కుమార్ (42) <<14363209>>మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. పోలీసుల కథనం.. అతను కొత్త బైకు కొని, తల్లిదండ్రులకు చూపించేందుకు వెళ్తుండగా లారీ ఢీ కొని కొంతదూరం లాక్కెల్లింది. ప్రమాదంలో గాయపడిన అతడిని రాజమండ్రికి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై సతీశ్ కుమార్ తెలిపారు.

Similar News

News November 5, 2024

ఏలూరు: ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్ట్

image

ఏలూరు జిల్లాతో పాటు పలు ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ తెలిపారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ద్విచక్రవాహనాల దొంగతనాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఈ క్రమంలో పూతి ప్రసాద్ , అప్పల నాయుడు, నాగాంజనేయులు అనే ముగ్గురిని అదుపులోకి తీసుకుని రూ.17,50,000 విలువ గల 25 వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.

News November 5, 2024

ప.గో: పేలుడు ఘటనలో మరొకరు మృతి

image

ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో గత నెల 30న జరిగిన బాణసంచా తయారీ కేంద్రంలోని పేలుడు ఘటనలో మరొకరు మరణించారు. పెంటపాడు మండలం రావిపాడుకు చెందిన మందలంక కమలరత్నం(47) ఏలూరులో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఈ ప్రమాదంలో అదే రోజు ఇద్దరు మృతిచెందగా.. అనంతరం మరొకరు ప్రాణాలు విడిచారు. రత్నం మృతితో పేలుడు ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. 

News November 5, 2024

జాతీయస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ఇద్దరు ఎంపిక

image

ఈనెల 18 నుంచి 22 వరకు ఛత్తీస్ ఘడ్ రాష్టంలోని రాజనందిగంలో జరుగు 68వ జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాల బాలికల పోటీలకు పశ్చిమ గోదావరి నుంచి ఇద్దరు ఎంపిక అయ్యారు. ఏలూరు కస్తూరిబా మున్సిపల్ పాఠశాలకు చెందిన ఎం.యోగశ్రీ, దెందులూరు మండలం కొవ్వలి ఉన్నత పాఠశాలకు చెందిన చార్లెస్ వెస్లీ ఎంపికయ్యారు. వీరిని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అభినందించారు.