News November 30, 2024

గోపాలపురం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

గోపాలపురం మండలం జగన్నాథపురంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం తెలిసిందే. ఎస్ఐ సతీష్ వివరాల మేరకు.. రెడ్డిగణపవరం నుంచి వాడపల్లి వెంకన్న సన్నిధికి వామిశెట్టి వెంకటేశ్వరరావ్, షేక్ బేగం(35) బైక్‌పై వెళ్తుండగా జగన్నాథపురంలో ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా బేగం మృతి చెందారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

Similar News

News December 3, 2024

‘ఉమ్మడి జిల్లాలో మద్యం బంద్’

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 3వ సాయంత్రం 4 గంటల నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు మద్యం షాపులు మూసి వేయనున్నట్లు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ కె.ఎస్.వి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. సోమవారం రాత్రి ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల దృష్ట్యా మధ్య విక్రయిస్తే చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.

News December 3, 2024

అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం: ప.గో జిల్లా ఎస్పీ

image

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొని ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా నలుమూలల నుంచి 11 దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపించి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

News December 2, 2024

నిడదవోలు: పని ఒత్తిడి తగ్గించాలని పంచాయతీ కార్యదర్శుల వినతి

image

పని ఒత్తిడి తగ్గించాలంటూ నిడదవోలు మండల పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో డి. లక్ష్మినారాయణకు వినతి పత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సర్వేలు, వివిధ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి పని ఒత్తిడి తగ్గించాలని కోరారు.  ఓ పక్క చేయాల్సిన పని, మరోపక్క వరుస వీడియో కాన్ఫరెన్సులు, సమీక్షలతో ఇబ్బందిగా ఉందని అన్నారు.