News March 14, 2025

గోపాల మిత్రుల ఆధ్వర్యంలో రూ. లక్ష ఆర్థిక సహాయం

image

సిద్దిపేట మండలానికి చెందిన గోపాలమిత్ర మార్గడి వెంకట్ రెడ్డి ఇటీవల మృతి చెందారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా గోపాలమిత్ర సంఘం సభ్యుల ఆధ్వర్యంలో గురువారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గోపాల మిత్ర అధ్యక్షుడు సింగం రాజు యాదవ్, రాష్ట్ర సలహాదారు శ్రీరాములు, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి ఉన్నారు.

Similar News

News March 22, 2025

శ్రీకాకుళం: జాబ్ మేళా.. యువతకు ఉద్యోగాలు

image

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళా బలగ హాస్పిటల్ జంక్షన్‌లో ఉన్న పారిశ్రామిక శిక్షణ కేంద్రం (డీఎల్డీసీ-ఐటీఐ)లో ఈనెల 24 వ తేదీన జరగనుందని డీఎల్డీసీ అసిస్టెంట్ డైరెక్టర్ వై.రామ్మోహనరావు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, తదితర అర్హత కలిగిన యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News March 22, 2025

విరాట్ మంచోడు.. కానీ అది మైదానంలో దిగనంతవరకే: సాల్ట్

image

విరాట్ కోహ్లీపై ఆయన ఆర్సీబీ టీమ్ మేట్ ఫిల్ సాల్ట్ ప్రశంసలు కురిపించారు. ‘విరాట్ చాలా మంచి వ్యక్తి. ఎప్పుడూ సరదాగా ఉంటారు. కానీ అది మైదానంలో దిగనంతవరకే. గ్రౌండ్‌లో ఆయన తీవ్రత వేరే స్థాయిలో ఉంటుంది. యుద్ధాన్ని కోరుకుంటారు. ఈ సీజన్లో ఆయనతో కలిసి బ్యాటింగ్ చేయనుండటం చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు. సాల్ట్ గత సీజన్‌లో కేకేఆర్‌కు ఆడారు.

News March 22, 2025

టెన్త్ పేపర్ లీక్: ఇద్దరు ఆఫీసర్ల సస్పెన్షన్

image

TG: నల్గొండ జిల్లా నకిరేకల్‌లోని SLBC బాలికల గురుకుల పాఠశాలలో తెలుగు పేపర్ లీక్ ఘటనకు బాధ్యులైన అధికారులపై విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకుంది. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లను సస్పెండ్ చేసింది. అలాగే పేపర్ లీకేజీకి సహకరించిన విద్యార్థినిని కూడా డిబార్ చేసింది. కాగా నిన్న తెలుగు ప్రశ్నాపత్రానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.

error: Content is protected !!