News March 2, 2025

గోరంట్లలో విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

గోరంట్ల మండలం బూచేపల్లి గ్రామంలో శనివారం విద్యుత్ షాక్ తగిలి రైతు శివప్ప (33) అక్కడికక్కడే మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. వ్యవసాయ పొలంలో విద్యుత్ తీగలు నేలపై ఉండడంతో వాటిని ఎత్తులో కట్టేందుకు కట్టెలు నాటుతుండగా చేతికి విద్యుత్ తీగల తగిలి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు సీఐ శేఖర్ తెలిపారు.

Similar News

News January 1, 2026

ATP: చేతివాటం ప్రదర్శించిన బేకరీల యజమానులు

image

నూతన సంవత్సర వేడుకల వేళ జిల్లాలోని కొందరు బేకరీ షాపుల యజమానులు చేతివాటం ప్రదర్శించారు. లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ శంకర్ తనిఖీలు చేపట్టగా తూకాల్లో మోసం వెలుగు చూసింది. 1 కిలో కేక్‌కి 200 గ్రాములు తగ్గింది. కణేకల్, ఉరవకొండ, విడపనకల్లులో తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు. కణేకల్లులోని 2 షాపుల్లో రూ.20 వేలు, ఉరవకొండలో 4 షాపుల్లో రూ.41వేలు, విడపనకల్లులో 3 షాపుల్లో రూ. 27వేలు జరిమానా విధించారు.

News January 1, 2026

ATP: స్నేహానికి చిరునామా.. న్యూఇయర్ గ్రీటింగ్ కార్డ్స్

image

న్యూ ఇయర్ అంటేనే ఒకప్పుడు చిన్నారులు, యువత గ్రీటింగ్ కార్డ్స్‌తో సందడి చేసేవారు. దుకాణాల్లో ఛార్ట్స్ కొని ఫ్రెండ్స్‌కు అందించి విషెస్ చెప్పి ఆనందంగా గడిపేవారు. కార్డులు ఇవ్వకపోతే కొత్త ఏడాది రానట్టే అన్నట్లు ఫీలైనవారు ఎంతోమంది. తమకు ఇష్టమైన నటీనటులు, ఫ్లవర్స్ వంటి కార్డులు కొనేవారు. టెక్నాలజీ యుగంలో కంప్యూటర్ గ్రీటింగ్సే దిక్కయ్యాయి. మరి ఆ కార్డుల అనుభూతి మీరు పొందారా? కామెంట్ చేయండి..!