News April 11, 2025
గోరంట్ల మాధవ్‌పై తాడేపల్లిలో కేసు నమోదు

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్‌పై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. ఈ మేరకు గురువారం తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు మాట్లాడుతూ.. గోరంట్ల మాధవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు.
Similar News
News April 10, 2026
గుంటూరు కలెక్టర్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్..!

గుంటూరు కలెక్టర్ అధికారిక ఫేస్‌బుక్ పేజీ District Collector Guntur మాత్రమే అని అధికారులు వెల్లడించారు. CM Saikanth Varma las పేరుతో ఉన్నది నకిలీ అకౌంట్‌గా గుర్తించినట్లు తెలిపారు. ప్రజలు గమనించి మోసపోవద్దని, ఆ అకౌంట్‌ను అనుసరించవద్దని సూచించారు. అనుమానాస్పద అకౌంట్లపై వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఫేక్ ఐడీలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
News April 10, 2026
సీనియర్ T-20 గుంటూరు జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక

ఈ నెల 11 నుంచి 14 వరకు మూలపాడులో నిర్వహించనున్న ACA సీనియర్ T-20 మెన్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ పోటీలకు గుంటూరు జిల్లా సీనియర్ జట్టు ఎంపికైంది. క్రీడాకారులు షేక్ రషీద్(C), మహీప్, వంశీకృష్ణ(WC), అఖిల్, సిద్దార్థ్, ప్రణయ్ కుమార్, సమన్విత్, షేక్ అస్లాం బేగ్, రేవంత్ కుమార్, సిద్దు కార్తీక్ రెడ్డి, ఆకాశ్, షేక్.తౌఫిక్, మనోహర్, జయచంద్రకేశవ్, షేక్.బాజీ ఎంపికయ్యారు. మరో ఆరుగురు స్టాండ్ బైస్ ఉన్నారు.
News April 9, 2026
గుంటూరు: ఎస్పీలుగా పలువురి పేర్లు పరిశీలన

గుంటూరు జిల్లాలో పలువురు అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. డీజీపీ కార్యాలయం విడుదల చేసిన ఎస్పీల ప్యానెల్ జాబితాలో గుంటూరులో పనిచేస్తున్న పలువురు అదనపు ఎస్పీల పేర్లు ఉన్నాయి. గుంటూరు క్రైమ్స్ అదనపు ఎస్పీ కే. సుప్రజ, ఎల్ అండ్ ఓ అదనపు ఎస్పీ ఏ.టీ.వి రవికుమార్, అడ్మిన్ అదనపు ఎస్పీ జీ.వీ. రమణమూర్తి పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. వీరికి త్వరలో ఎస్పీలుగా పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది.


