News April 11, 2025
గోరంట్ల మాధవ్‌పై మరో కేసు

ఐటీడీపీ కార్యకర్త కిరణ్‌పై దాడికి యత్నించిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై గుంటూరు నగరంపాలెం పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఆయనను నేడు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు మంత్రి లోకేశ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మాధవ్‌పై తాడేపల్లి పీఎస్‌లో మరో కేసు నమోదైంది. నిన్న ప్రెస్ మీట్‌లో లోకేశ్ గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారని TDP నేతలు ఫిర్యాదు చేశారు.
Similar News
News April 17, 2025
అనంత– బెంగళూరు రైలుకు భారత రైల్వే శాఖ ఆమోదం

శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం నుంచి బెంగళూరుకు నడుస్తున్న MEMU రైలును అనంతపురం వరకు పొడిగిస్తూ కేంద్ర రైల్వే బోర్డు 2025 ఏప్రిల్ 15 న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పలు సందర్భాల్లో ఈ విషయం పై ప్రస్తావించారు. అతి కేంద్ర రైల్వే మంత్రి ప్రారంభిస్తారని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
News April 17, 2025
అనంతపురంలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్‌లో గురువారం సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాలు, తెగల వర్గాల నుంచి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అర్జీలు స్వీకరించారు. అర్జీలను స్వీకరించిన ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు. ఎస్పీ జగదీష్, DRO ఏ.మలోల, అడిషనల్ ఎస్పీ రమణమూర్తి, డిప్యూటీ కలెక్టర్ రామ్మోహన్, అనంతపురం ఆర్డీఓ కేశవ నాయుడు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
News April 17, 2025
ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డల జననం

హిందూపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు. రొద్దం మండలం శేషాపురం గ్రామానికి చెందిన శిల్ప బుధవారం రాత్రి పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చారు. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో సాధారణ ప్రసవంలో ఇద్దరు మగ, ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చారని డా.నీరజ తెలిపారు. శిశువుల బరువు తక్కువ ఉండటంతో అనంతపురం రెఫర్ చేశామన్నారు. తల్లి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.