News March 11, 2025
గోలేటి ఏరియా స్టోర్లో చోరీ.. నలుగురు అరెస్ట్

గోలేటి ఏరియా స్పోర్ట్ చోరికి పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తాండూర్ CI కుమారస్వామి తెలిపారు. మందమర్రికి చెందిన మోతే రాజయ్య, నరసయ్య, తిరుపతి, మధు జనవరి 8న గోలేటి ఏరియా వర్క్ షాప్లోని సింగరేణి అధికారులు నిల్వ ఉంచిన పరికరాలను దొంగలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశామన్నారు. వాటి విలువ 6.22లక్షలు ఉంటుందన్నారు.
Similar News
News October 28, 2025
అనకాపల్లి జిల్లాలో 74 పునరావాస కేంద్రాలు: కలెక్టర్

జిల్లాలో 74 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సహాయక చర్యలు ఏర్పాట్లపై సమీక్షించారు. మంగళవారం నుంచి పునరావాస కేంద్రాలు పని చేయాలన్నారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ భవనాలు గుర్తించి సిద్ధంగా ఉంచాలన్నారు. ముందస్తు చర్యల్లో నిర్లక్ష్యం వద్దన్నారు.
News October 28, 2025
పిల్లలకు ఆన్లైన్ లిటరసీ నేర్పిస్తున్నారా?

ప్రస్తుతకాలంలో పిల్లలు స్మార్ట్ గ్యాడ్జెట్లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. అయితే వారికి దీంట్లో ఉండే కష్టనష్టాల గురించి చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనంటున్నారు నిపుణులు. సోషల్మీడియాపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలి. ఏదైనా పోస్ట్ చేసేముందు ఆలోచించాలని, గోప్యతకు ప్రాధాన్యతనివ్వాలని వారికి చెప్పాలి. ఆ పరిచయాలతోపాటు ఆఫ్లైన్లో దొరికే మానవసంబంధాల ప్రాధాన్యతనూ వారికి వివరించాలంటున్నారు.
News October 28, 2025
తుఫాను ఎఫెక్ట్.. పలు విమాన సర్వీసులు రద్దు

AP: మొంథా తుఫాను ప్రభావంతో నేడు విశాఖ, విజయవాడ విమానాశ్రయాలకు పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎయిరిండియా, ఇండిగో, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఫైట్లు నిలిచిపోనున్నాయి. అయితే ఇండిగో ఫైట్లు 10.45AM వరకు, ఢిల్లీ-VJA సర్వీసులు నడుస్తాయని VJA ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. అటు ఢిల్లీ, భువనేశ్వర్, VJA, రాయ్పూర్, హైదరాబాద్, బెంగళూరు నుంచి విశాఖకు వెళ్లే సర్వీసులన్నీ ఆగిపోనున్నాయి.


