News March 11, 2025
గోలేటి ఏరియా స్టోర్‌లో చోరీ.. నలుగురు అరెస్ట్

గోలేటి ఏరియా స్పోర్ట్ చోరికి పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తాండూర్ CI కుమారస్వామి తెలిపారు. మందమర్రికి చెందిన మోతే రాజయ్య, నరసయ్య, తిరుపతి, మధు జనవరి 8న గోలేటి ఏరియా వర్క్ షాప్‌లోని సింగరేణి అధికారులు నిల్వ ఉంచిన పరికరాలను దొంగలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశామన్నారు. వాటి విలువ 6.22లక్షలు ఉంటుందన్నారు.
Similar News
News March 25, 2025
50వేల మంది విద్యార్థులకు ‘సిస్కో’ శిక్షణ: లోకేశ్

AP: ఉన్నత, వృత్తి విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు IT సంస్థ సిస్కోతో ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. ‘నెట్‌వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, AI వంటి రంగాల్లో అత్యాధునిక కంటెంట్‌ను సిస్కో అందిస్తుంది. ఈ MoUతో 50K మందికి ఆ సంస్థ శిక్షణ ఇస్తుంది. మానవ వనరులకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నైపుణ్యాలను పెంచి, ఉపాధిని పెంపొందించడమే లక్ష్యం’ అని ట్వీట్ చేశారు.
News March 25, 2025
పార పట్టి కూలీలతో పని చేసిన భద్రాద్రి కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం టేకులపల్లి మండలం బోడు గ్రామపంచాయతీలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతు సమ్మయ్య పొలంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలతో కలిసి పారా, పలుగు పట్టి కొద్దిసేపు పని చేశారు. అనంతరం కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబం 100 రోజులు పనిని పూర్తి చేసుకోవాలని సూచించారు. రోజువారి వేతనం 300 రూపాయలు లభించేలా పనిచేయాలని సూచించారు.
News March 25, 2025
కార్మికుల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం: సత్యసాయి జేసీ

అను నిత్యం ప్రజల ఆరోగ్యం పరిరక్షించే సేవలలో నిమగ్నమైన పారిశుద్ధ్య కార్మికుల భద్రత, సంక్షేమానికి అధికారులు కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన గ్లౌజులు, మాస్కులు అందించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.