News November 15, 2024
గోల్కొండ కోటలో ‘ఆకలి’

500 ఏళ్ల నాటి గోల్కొండ కోటను చూడటానికి వెళితే ఆకలితో అలమటించాల్సిందే. ఎంతో ఆశతో కోటను చూడటానికి వెళ్లిన పర్యాటకులకు అక్కడ తినడానికి ఏమీ దొరకదు. కోట లోపల కేవలం ఐస్ క్రీమ్స్, వాటర్ బాటిల్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. బయటి నుంచి ఆహారం తీసుకెళ్లేందుకు కూడా అనుమతి లేదు. కోట చుట్టూ తిరగడానికి కనీసం నాలుగు గంటలు పడుతుంది. అధికారులు ఇప్పటికైనా ఈ విషయం గురించి ఆలోచించాలని పర్యాటకులు కోరుతున్నారు.
Similar News
News December 9, 2025
గ్లోబల్ సమ్మిట్: టెక్నాలజీ గుప్పిట్లో ‘ప్రగతి’ లక్ష్యాలు!

TG గ్లోబల్ సమ్మిట్లో ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (SDGs) సంచలనం సృష్టించాయి. ఫ్యూచరిస్టిక్ డోమ్లో ఈ 17 లక్ష్యాలను అద్భుతంగా ప్రదర్శించడం రాష్ట్ర ప్రభుత్వ ‘విజన్ 2047’కు అద్దం పట్టింది. వృద్ధి, పర్యావరణ పరిరక్షణ ఏకకాలంలో సాగాలనే స్పష్టమైన సందేశాన్నిస్తూ, సామాజిక న్యాయం, ఆర్థికాభివృద్ధిని ముడిపెట్టే ఈ ప్రదర్శన సమ్మిట్కు వచ్చిన ప్రపంచ దేశాల ప్రతినిధులను ఆకర్షించింది.
News December 9, 2025
HYD: గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ సంస్కృతి, రుచులకు పెద్దపీట

హైదరాబాద్లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్లో విదేశీ అతిథులను మంత్రముగ్ధులను చేసేందుకు తెలంగాణ సంస్కృతి, రుచులకు పెద్దపీట వేశారు. శక్తివంతమైన గుస్సాడీ, బోనాలు, పేరిణి శివతాండవం వంటి నృత్యాలను ప్రదర్శిస్తున్నారు. అతిథులకు ప్రత్యేకంగా ‘తెలంగాణ మెనూ’ను సిద్ధం చేశారు. ఇందులో సకినాలు, సర్వపిండి, దమ్ బిర్యానీ, హలీమ్ వంటి సాంప్రదాయ వంటకాలు ఉన్నాయి.
News December 8, 2025
Global summit: ఆకాశంలో తెలంగాణ ప్రగతి చిత్రం

Global summitలో 3,000 డ్రోన్లతో కూడిన లేజర్ లైటింగ్ షో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వినోదం కోసమే కాకుండా TG అభివృద్ధి ప్రస్థానం, సాంకేతిక ఆవిష్కరణలను ప్రపంచానికి చాటిచెప్పడానికి ఉద్దేశించిన కార్యక్రమం. ఆకాశంలో తెలంగాణ చిహ్నాలు, రాష్ట్ర ప్రభుత్వ కీలక పథకాలు, పారిశ్రామిక విజయాన్ని ప్రతిబింబించే దృశ్యాలను ఆవిష్కరిస్తుంది. ‘HYD ఫార్మా హబ్’, AI సిటీ’ విజన్లను డ్రోన్ల ద్వారా 3D రూపంలో ప్రదర్శించనున్నారు.


