News December 10, 2024

గోల్కొండ: సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో దరఖాస్తులు స్వీకరణ

image

సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ఆన్‌లైన్ శిక్షణకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు. మణికొండలోని కార్యాలయంలో దరఖాస్తులను ఈనెల 21వ తేదీలోగా స్వయంగా, ఆన్‌లైన్ ద్వారా అందజేయాలని ఆమె కోరారు. శిక్షణ అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆమోదిత సర్టిఫికెట్స్‌ను ప్రధానం చేయడం జరుగుతుందన్నారు. 

Similar News

News November 11, 2025

జూబ్లీహిల్స్‌ బైపోల్.. ఓటేస్తేనే అడిగే హక్కు..!

image

భారత రాజ్యాంగం మనకు ఓటు అనే వజ్రాయుధాన్ని ఇచ్చింది.. దానిని మీ వద్దే ఉంచుకుంటే ఎలా? ఇప్పుడు బయటకు తీయండి. మా ఏరియాలో ఆ సమస్యలు ఉన్నాయి.. ఈ సమస్యలున్నాయి.. ఎవరూ పట్టించుకోరు అని చాలా మంది నిరసన కార్యక్రమాలు చేస్తుంటారు. మీరు కూడా అలా చేసి ఉంటారు. ఇటువంటి ఎన్నికల సమయంలో మీరు మంచి నాయకుడిని ఎన్నుకోండి.. లేకపోతే సమస్యలు అలాగే ఉండిపోతాయి.. మనల్ని పట్టించుకునే వారే ఉండరు. ఓటేసేందుకు కదలిరండి.

News November 11, 2025

జూబ్లీహిల్స్: నేడే పోలింగ్.. ఓటే ఆయుధం..!

image

గెలుపు ఓటములను డిసైడ్ చేసేందుకు ఒక్క ఓటు చాలు. ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నేడు జరగనుంది. మీ ఓటును ఆయుధంగా వాడండి.
> మొత్తం ఓటర్లు: 4,01,365
> పురుషులు: 2,08,561
> మహిళలు: 1,92,779
> ఇతరులు: 25
> బీసీలు: 1.50-1.80 లక్షలు, ముస్లింలు: 96,500, ఎస్సీలు: 26,000, కమ్మ: 17,000, రెడ్లు: 18,000, యాదవులు: 15,000, క్రిస్టియన్లు: 10,000
> కొత్త ఓటర్లు: 12,380 (18-19 ఏళ్లు)

News November 11, 2025

జూబ్లీహిల్స్: పెద్దల స్ఫూర్తితో ఓటేద్దాం పదండి..!

image

వారికి ఒంట్లో శక్తి లేదు.. అవయవాలు సరిగా పనిచేయవు.. అయినా ఓటు వేసే బాధ్యత మాత్రం మరవలేదు.. జూబ్లీహిల్స్‌లో 103 మంది వృద్ధులు హోం ఓటింగ్‌కు అప్లై చేయగా అందులో 101 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగిలిన ఇద్దరు అంతకు ముందే చనిపోయారు. అంటే దాదాపు అందరూ ఓటేశారు. శరీరం సహకరించకపోయినా వాళ్లు ఓటేశారు. మరి మిగితా వారు వాళ్లు ఇచ్చిన స్ఫూర్తితో ఓటేసేందుకు కదిలిరండి.
> మీ ఓటు.. మీ బాధ్యత