News November 26, 2024

గోల్డెన్ అవర్‌ను మిస్ చేసుకోకండి: నెల్లూరు SP

image

సైబర్ మోసానికి గురైతే గోల్డెన్ అవర్‌ను మిస్ చేసుకోవద్దని ఎస్పీ కృష్ణకాంత్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. ఒక వ్యక్తి అకౌంట్ నుంచి డబ్బు మాయమైన గంటలోపు ఉండే సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారన్నారు. ఆ సమయంలో ఫిర్యాదు చేస్తే డబ్బులు ఫ్రీజ్ చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. దీంతో బాధితుడికి డబ్బులు తిరిగి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే  వెంటనే 1930 నంబరుకు ఫోన్ చేయాలన్నారు.

Similar News

News December 8, 2024

మనుబోలు హైవేపై లారీ బోల్తా

image

మనుబోలు మండలంలోని ఆదిశంకర ఇంజినీరింగ్ కాలేజ్ పక్కన సర్వీస్ రోడ్డులో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి నాయుడుపేట వైపు వెళుతున్న లారీ వేగంగా వెళుతూ అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.

News December 8, 2024

రోడ్డు ప్రమాదంలో నలుగురు సిరిపురం వాసులు స్పాడ్ డెడ్

image

పల్నాడు జిల్లాలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనలో చనిపోయింది కావలి మండలం సిరిపురం వాసులుగా సమాచారం. వారు కారులో కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం అనంతరం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను తుళ్లూరి సురేష్, వనిత, యోగిలు, వెంకటేశ్లర్లుగా గుర్తించారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News December 7, 2024

పాఠశాలల అభివృద్ధికి తల్లిదండ్రుల పర్యవేక్షణ: కలెక్టర్

image

పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రుల పర్యవేక్షణ అత్యవసరమని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. శనివారం ఆయన నెల్లూరులోని దర్గామిట్ట డీసీఆర్ జెడ్పి ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమిష్టి కృషితోనే పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు ఏర్పడతాయన్నారు.