News February 22, 2025
గోల్డ్ మెడల్ సాధించిన నందలూరు విద్యార్థినీలు

బెంగళూరులో జరిగిన నేషనల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2025 సీజన్ 8 ఫైనల్స్‌లో నందలూరు విద్యార్థినీలు గోల్డ్ మెడల్ సాధించారు. గురువారం జరిగిన ఫైనల్స్‌లో 14 రాష్ట్రాల విద్యార్థులతో పోటీపడగా.. నందలూరుకు చెందిన ఎన్. లక్ష్మీ చైతన్య, ఎస్. జైనబ్ గోల్డ్ మెడల్ సాధించారు. మెంటర్ వరప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థులు నాలుగు నెలల పాటు శిక్షణ పొందారు.
Similar News
News March 27, 2025
ఉమ్మడి కరీంనగర్‌లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన

రాజన్న సిరిసిల్లలో జిల్లాలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుల పర్యటన వివరాలను ఛైర్మన్ బక్కి వెంకటయ్య విడుదల చేశారు. జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏప్రిల్ 3, 4 తేదీల్లో దళితులపై చేసే దారుణాలు, భూ సమస్యలపై రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి బాధితులకు ఎలాంటి చట్టపరమైన సహాయం చేయనున్నట్లు తెలిపారు. సహాయనిధి, నిందితుల తీరుని ఎలా కట్టడి చేస్తున్నారు అనేదానిపైన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు.
News March 27, 2025
డైరెక్టర్ మెహర్ రమేశ్ ఇంట్లో విషాదం.. పవన్ సానుభూతి

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేశ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరి మాదాసు సత్యవతి ఇవాళ హైదరాబాద్‌లో కన్నుమూశారు. సత్యవతి మరణం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబం విజయవాడలోని మాచవరం ప్రాంతంలో నివసించేదని, చదువుకునే రోజుల్లో వేసవి సెలవులకు వాళ్ల ఇంటికి వెళ్లేవాళ్లమని ఆయన గుర్తు చేసుకున్నారు. సత్యవతి ఆత్మకు శాంతి కలగాలని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
News March 27, 2025
ప్రభుత్వ ఆఫీసుల్లో AI వినియోగంపై నిషేధం లేదు: కేంద్రమంత్రి

ప్రభుత్వ కార్యాలయాల్లో AI వినియోగంపై ప్రత్యేకంగా ఎలాంటి నిషేధం లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. డిజిటల్ సాంకేతికతను వాడుతున్న సమయంలో ప్రజా సమాచార భద్రత, గోప్యత విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని రాజ్యసభలో చెప్పారు. ప్రభుత్వ అధికారులు ఏదైనా అప్లికేషన్, వెబ్‌సైట్, సాంకేతికతను ఉపయోగించిన విషయంలో సైబర్ సెక్యూరిటీ గైడ్‌లైన్స్‌కు లోబడి వ్యవహరించాలని కేంద్రం పేర్కొంది.